TTD: భక్తులకు అలర్ట్.. మరికాసేపట్లో ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు

Update: 2023-09-25 03:03 GMT

కలియుగ వైకుంఠం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి (Lord Venkateswara Swamy) భక్తులకు అలర్ట్. డిసెంబర్ మాసానికి సంబంధించిన రూ. 300 ల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను మరికాసేపట్లో విడుదల చేయనుంది టీటీడీ. ఉదయం 11 గంటలకు ఆన్ లైన్ లో టికెట్లు అందుబాటులో ఉంటాయని తెలిపింది. టీటీడీ అధికారిక వెబ్‌సైట్‌ https://tirupatibalaji.ap.gov.in లో దర్శన టికెట్లు బుక్ చేసుకోవాలని సూచించింది టీటీడీ. అయితే 24వ తేదీనే ప్రత్యేక ప్రవేశ దర్శనం కోటాను విడుదల చేయాల్సి ఉండగా.. ఇవాళ్టికి వాయిదా వేసింది. ఇక తిరుమల వసతి గదుల కోటాను సెప్టెంబర్ 27వ తేదీన విడుదల చేయనున్నట్లు వెల్లడించింది.

ఇక తిరుమలలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా నిర్వహించే బంగారు గొడుగు ఉత్సవం ఆదివారం ఘనంగా జరిగింది. సోమవారం శ్రీవారి రథోత్సవం నేపథ్యంలో ఆదివారం సాయంత్రం శ్రీవారి కల్యాణ కట్ట సిబ్బంది నూతన ఛత్రస్థాపన చేశారు. ప్రధాన కల్యాణ కట్టలో బంగారు గొడుగుకు ప్రత్యేక పూజలు చేశారు. పూజల అనంతరం కల్యాణ కట్ట సిబ్బంది గొడుగును టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, ఈఓ ధర్మారెడ్డికి అప్పగించారు.

సాధారణంగా శ్రీవారి దర్శనం కోసం కోట్లాది మంది భక్తులు ఎదురు చూస్తుంటారు. ఎన్నో వ్యయప్రయాసలకు ఓర్చి వెళ్లినా.. గంటల తరబడి అక్కడ క్యూ లైన్లో ఎదురు చూడాల్సి వస్తుంది. ఒక్కోసారి అయితే రోజుల తరబడి స్వామివారి దర్శనం కోసం ఎదురు చూడాల్సి ఉంటుంది. దానికి భయపడే భక్తులు ఎప్పటికప్పుడు తమ ప్రయాణాన్ని వాయిదా వేసుకుంటూ ఉంటారు. అయితే అలా తిరుమల (Tirumala) వెళ్లాలి అని.. అక్కడ రద్దీ కోసం భయపడుతున్న వారికి గుడ్ న్యూస్.. తిరుమల వెళ్లాలి నుకునే వారికి ఇదే సరైన సమయం. ఎందుకంటే ప్రస్తుతం అక్కడ రద్దీ సాధారణంగా కనిపిస్తోంది. వారంతాల్లో మినహా.. మిగిలిన రోజుల్లో రద్దీ తక్కువగానే ఉంటోంది.

Tags:    

Similar News