చిరుతతో సెల్ఫీ.. వీళ్లు మామూలోళ్లు కాదు సామి..

Update: 2023-08-20 05:45 GMT

పులిని దూరం నుంచి చూడాలనుకుంటే చూస్కో.. పులితో ఫొటో దిగాలనిపిస్తే కొంచెం రిస్క్ అయినా సరే దిగు అనేది ఎన్టీఆర్ సినిమాలోని ఓ డైలాగ్. దీన్నే ఆదర్శంగా తీసుకుని ఇద్దరు వ్యక్తులు రిస్క్ చేశారు. చిరుత పులితో ఫొటో కాదు ఏకంగా వీడియోనే తీసుకున్నారు. ఈ ఘటన ఏపీలోని కర్నూల్ జిల్లాలో జరిగింది.

కర్నూలు జిల్లా తుగ్గలి మండలం రామకొండ సమీపంలోని కొండల్లో ఓ చిరుతపులి కనిపించింది. గుట్టల్లో ఓ బండరాయిపై చిరుతపులి మాటువేసి కిందకి చూస్తోంది. అక్కడే ఉన్న ఇద్దరు వ్యక్తులు.. ఆ చిరుతపులిని గమనించి.. మరోవైపు నుంచి గుట్టపైకి చేరుకున్నారు. ఆ చిరుతపులితో దూరం నుంచే సెల్ఫీ వీడియో తీసుకున్నారు. ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అది వైరల్గా మారింది. సదరు వ్యక్తులు గొర్లకాపర్లని తెలుస్తోంది. అయితే ఎటువంటి భయం లేకుండా ఏకంగా పులితో వీడియో తీసుకోవడంపై అందరూ షాక్ అవుతున్నారు.

కాగా అటు తిరుమలలో చిరుతపులులు భయపెట్టిస్తున్నాయి. చిరుత దాడిలో ఇప్పటికే ఓ చిన్నారి మృతి చెందింది. దీంతో టీటీడీ అప్రమత్తమై ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. తిరుమలలో మొత్తం 5 చిరుతలు సంచరిస్తుండగా.. ఇప్పటికే రెండు చిరుతలను అధికారులు బంధించారు. మరోవైపు తిరుమల మెట్ల మార్గంలో మధ్యాహ్నం 2 తర్వాత 15ఏళ్ల లోపు పిల్లలను అనుమతించడం లేదు. పిల్లల పట్ల తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని టీటీడీ సూచించింది.

Tags:    

Similar News