Ayyanna Patrudu : నత్తి పకోడిగాడు, పాడెయాత్ర... జగన్‌పై అన్నయ్య ఫైర్
తెలంగాణ ఎన్నికల్లో పార్టీల నేతలు ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకుంటున్నారు. సవాళ్లు, ప్రతి సవాళ్లు విసురుకుంటున్నారు. ఎన్నికల వాతావరణం లేని ఏపీలో సైతం ఘాటుగా తిట్టుకుంటున్నారు. రాజకీయాలు, ప్రజాసమస్యలను గాలికి వదిలేసి వ్యక్తిగత జీవితాలను టార్గెట్ చేసుకుంటున్నారు. ఏ మాత్రం హుందా లేకుండా బజారుకెక్కుతున్నారు. అధికార వైసీపీ ఒక మాటంటే, విపక్ష టీడీపీ రెండు అంటోంది. ఎవరూ తగ్గేదేలే అంటున్నారు. ‘నత్తి పకోడిగాడు.. మూతులు నాకే పాడెయాత్ర.. దొంగసాయిగా..’’ అంటూ టీడీపీ నేత అయ్యన్నపాత్రుడు ఏపీ సీఎం జగన్‌ను, ఎంపీ విజయసాయిరెడ్డిని ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశాడు. టీడీపీ నేత లోకేశ్‌కు జబ్బు ఉందంటూ వైసీపీ ఎంపీ వియసాయిరెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేయడమే దీనికి కారణం.
లోకేశ్ కు గాలికుంటు.. విజయసాయి..
లోకేశ్ పాదయాత్రపై విజయ్ సాయి అభ్యంతరకరమైన ట్వీట్ చేశాడు. ‘‘ఎవరు నడవమన్నారో, ఎందుకు పెట్టుకున్నారో యువగళం యాత్ర. నడక భారమై బిత్తర సవాళ్లు విసురుతున్నారు లోకేశ్ గారు. గాలికుంటు, బ్లూ టంగ్ వ్యాధులేమైనా సోకి నాలుక వాచిందేమో టెస్ట్ చేయించుకోండి చినబాబు. ఛాలెంజికి కూడా ఒక స్థాయి ఉండాలి’’ అని అన్నాడు.
నీకు మెదపువాపు.. బొక్కలో వేయిస్తా.. అయ్యన్న
విజయసాయి రెడ్డి ట్వీట్‌కు అయ్యన్నపాత్రులు అంతే ఘాటుగా బదులు తీర్చుకున్నాడు. ‘‘మీ అల్లుడు నత్తి పకోడీగాడిని అప్పుడు ఎవరు నడవమన్నారు దొంగ సాయి! కనిపించినవాళ్లకల్లా ముద్దులు పెట్టి, మూతులు నాకి మీ అల్లుడు ఎందుకు చేశాడురా పాడెయాత్ర. నడవలేక కోర్టు వాయిదాల పేరుతో యాత్రని వాయిదా వేసుకోవడం మీ దొంగల్లుడికే చెల్లు. పీకల్లోతు కేసుల్లో ఇరుక్కుని, అధికారంపోతే నీ బతుకేంటో తెలియక మెదడువాపు వ్యాధి వచ్చి పిచ్చి ట్వీట్లు వేస్తున్న దొంగసాయి..మూడు నెలల తరువాత ఏ దేశం పారిపోదామా అని ప్లాన్లు వేస్తున్నావట! సప్తసముద్రాల అవతల దాక్కున్నా లాక్కొచ్చి తిన్నదంతా కక్కించి, పేలిన ప్రతీ తప్పుడు కూతకీ వాత పెట్టించీ..బొక్కలో వేస్తాంరా దొంగ సాయిగా..’’ అని హెచ్చరించాడు.
మీ అల్లుడు నత్తి పకోడీగాడిని అప్పుడు ఎవరు నడవమన్నారు దొంగ సాయి! కనిపించినవాళ్లకల్లా ముద్దులు పెట్టి, మూతులు నాకి మీ అల్లుడు ఎందుకు చేశాడురా పాడెయాత్ర. నడవలేక కోర్టు వాయిదాల పేరుతో యాత్రని వాయిదా వేసుకోవడం మీ దొంగల్లుడికే చెల్లు. పీకల్లోతు కేసుల్లో ఇరుక్కుని,… https://t.co/8YVPTj0h0m
— Ayyanna Patrudu (@AyyannaPatruduC) November 28, 2023