సినీ పరిశ్రమ పిచ్చుకే.. కానీ చిరంజీవి మాత్రం కాదు : ఉండవల్లి

Update: 2023-08-09 09:58 GMT

ఏపీ ప్రభుత్వంపై మెగాస్టార్ చిరంజీవి చేసిన కామెంట్స్ ఇప్పుడు కాకరేపుతున్నాయి. చిరు వ్యాఖ్యలకు వైసీపీ నాయకులు కౌంటర్ ఎటాక్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మెగాస్టార్‌కు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ మద్దతు పలికారు. సినిమా పరిశ్రమ పిచ్చుకేనని..కాని చిరంజీవి మాత్రం కాదని వ్యాఖ్యానించారు. చిరంజీవి కారణంగానే హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా వచ్చిందన్నారు. రాష్ట్ర విభజన సమయంలో కేంద్రమంత్రిగా ఉన్న చిరంజీవి ఉమ్మడి రాజధాని కోసం సొంత ప్రభుత్వంపైనే గట్టిగామాట్లాడారని గుర్తుచేశారు. ఓ మంత్రి హోదాలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లడటం సాధారణ విజయం కాదన్నారు. అలాంటి మెగాస్టార్ వైసీపీ ప్రభుత్వానికి సలహాలు, సూచనలు ఇవ్వడంలో తప్పులేదని తెలిపారు. పోలవరం ప్రాజెక్టు ముందుకు కదలకపోవడంపై ఉండవల్ల అసహనం వ్యక్తం చేశారు. వైసీపీ, టీడీపీ ప్రభుత్వాలు పోలవరంను కట్టలేకపోయాయని విమర్శించారు. ఇది పూర్తి కావాలంటే మరో ప్రభుత్వం రావాలని వ్యాఖ్యానించారు. తెలంగాణలో సాగునీటి ప్రాజెక్టులు కారణంగానే ఈ ఏడాది ధాన్యం ఉత్పత్తిలో అగ్రస్థానంలో నిలిచింది వివరించారు.

డబ్బులు ఉంటేనే కోర్టులో న్యాయం జరగుతుందని ఉండవల్లి అరుణ్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. మార్గదర్శి కేసు విషయంలో రామోజీరావు కోర్టులో బాగా పలుకుబడి ఉపయోగిస్తున్నారని తెలిపారు. ఏపీ ప్రభుత్వం కంటే రామోజీరావుకే ఎక్కవ పలుకుబడి ఉందన్నారు. పేదవాడికి న్యాయం జరగటం లేదని, నిజాలు బయటపెట్టాల్సిన భాద్యత ప్రభుత్వంపై ఉందన్నారు. ప్రభుత్వానికి చేతకాక రామోజీరావుపై చర్యలు తీసుకోవటం లేదని విమర్శించారు. 

Tags:    

Similar News