వంగవీటి వారసురాలు పొలిటికల్ ఎంట్రీ

By :  Kiran
Update: 2023-07-26 15:22 GMT

బెజవాడ అడ్డాగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చెరగని ముద్ర వేసి, దారుణ హత్యకు గురైన వంగవీటి మోహన రంగ గురించి అందరికీ తెలిసిందే. ఆయన వారసురాలు వంగవీటి ఆశాలత.. పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. ఏపీ శాసన సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ వంగవీటి ఆశ పొలిటికల్ ఎంట్రీ విషయం హాట్ టాపిక్ అయింది. ఈ క్రమంలో ఆశాలతను తమ పార్టీ తరుపున రంగంలోకి దించాలని పలు పార్టీలు ఇప్పటినుంచే వ్యూహాలు రచిస్తున్నట్లు తెలుస్తోంది. బెజవాడలోని అన్ని సామాజిక వర్గాల పక్షాన అండగా నిలిచారు వంగవీటి రంగ. అందుకే ఆయన కుటుంబంపై బెజవాడ ప్రజలకు ప్రత్యేక అభిమానం. ముఖ్యంగా కాపు సామాజిక వర్గం నుంచి మంచి సపోర్ట్ ఉంది. దీంతో కాపు సామాజిక వర్గం ఓటర్లను ఆకట్టుకునేందుకు రాజకీయ పార్టీలు ప్రయత్నాలు చేస్తున్నాయి.

అందుకే ఇప్పటివరకు ఎన్నికలు వచ్చిన ప్రతీసారి కాపు వర్గం ఎక్కువగా ఉన్న స్థానాల్లో వంగవీటి జపం చేస్తుంటాయి. ఈ క్రమంలో వంగవీటి ఆశలత రాజకీయాల్లోకి రావడంపై చర్చలు నడుస్తున్నాయి. ఒకవేళ ఆశలత రాజకీయాల్లోకి వస్తే.. బెజవాడ సెంట్రల్ లేదా విజయవాడ వెస్ట్ నుంచి ఎన్నికల బరిలోకి దిగే అవకాశం ఉంది. అదే జరిగితే ఉమ్మడి కృష్ణా, గుంటూరు, ఉభయ గోదావరి జిల్లాల్లో ఉన్న కాపు వర్గం బలపడుతుంది. ఈ ఓట్లను తమ వైపు తిప్పుకునేందుకు ప్లాన్ చేస్తున్నాయి పార్టీలు. గతంలో రంగా హత్య జరిగిన తర్వాత ఆయన భార్య రత్న కుమారి 1989, 1994లో విజయవాడ తూర్పు తరుపున ఎమ్మెల్యేగా పనిచేశారు. 2004 వంగవీటి రంగా తనయుడు వంగవీటి రాధాకృష్ణ విజయం సాధించినప్పటికీ.. ఆయన వారసత్వంగా రాష్ట్రంలో రాజకీయాలను కొనసాగించలేకపోయారు. ఈ క్రమంలో ఆశలత రాజకీయ ఎంట్రీ ఏమరరకు ఫలిస్తుందో చూడాలి.

Tags:    

Similar News