ఏపీ సీఎం జగన్కు మరో ఎంపీ షాకిచ్చారు. ఇటీవలే మచిలీపట్నం ఎంపీ వైసీపీని వీడగా.. తాజాగా రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వైసీపీకి రాజీనామా చేశారు. వేమిరెడ్డి రాజ్యసభ పదవీకాలం ఏప్రిల్ 2తో ముగియనుంది. అదేవిధంగా ఆయన నెల్లూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా ఉండగా.. ఆయన సతీమణి ప్రశాంతి రెడ్డి టీటీడీ బోర్డ్ మెంబర్గా ఉన్నారు. ఈ క్రమంలో పార్టీతో పాటు పదవులకు సైతం వారు రాజీనామా చేశారు. అయితే వ్యక్తిగత కారణాలతో పార్టీని వీడుతున్నట్లు జగన్కు లేఖ రాశారు. వేమిరెడ్డి త్వరలోనే టీడీపీ కండువా కప్పుకునే అవకాశం ఉంది. వైసీపీలో సరైన గుర్తింపు దక్కడంలేదంటూ ఆయన గత కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు.