కోడికత్తి కేసులో కీలక పరిణామం.. వైజాగ్ కోర్టుకు బదిలీ

Update: 2023-08-01 10:41 GMT

ఏపీ సీఎం జగన్పై కోడికత్తి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసును విశాఖ కోర్టుకు బదిలీ చేస్తూ విజయవాడ ఎన్ఐఏ కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసిన న్యాయస్థానం.. తదుపరి విచారణను ఆగస్టు 8కి వాయిదా వేసింది.

2018లో విశాఖ ఎయిర్ పోర్టులో జగన్పై శ్రీనివాస్ రావు అనే వ్యక్తి కోడి కత్తితో దాడి చేశారు. ఈ ఘటనలో జగన్ మోచేతికి గాయమైంది. తొలుత ఈ కేసును సిట్ విచారించగా.. సిట్ పై నమ్మకం లేదంటూ కోర్టును ఆశ్రయించాడు. కేంద్ర దర్యాప్తు సంస్థలతో విచారణ జరపాలని కోర్టును కోరారు. కోర్టు ఆదేశాలతో ఎన్ఐఏ కేసు చేసి దర్యాప్తు జరుపుతోంది. అప్పటినుంచి ఈ కేసు విచారణ విజయవాడ ఎన్ఐఏ కోర్టులో సాగుతోంది.

తాజాగా విజయవాడ ఎన్ఐఏ కోర్టు నిర్ణయంతో తదుపరి విచారణ విశాఖ కోర్టులో సాగనుంది. అయితే ఈ నిర్ణయంపై నిందితుడు శ్రీనివాస్ లాయర్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కేసులో 80శాతం విచారణ పూర్తైన తర్వాత కేసున మరో ప్రాంతానికి తరలించడం ఏంటని ప్రశ్నించారు. అయితే కేసును అంత తేలిగ్గా వదలేది లేదు అని.. తమ వాదనలను బలంగా వినిపిస్తామని చెప్పారు. అయితే కేసు కొలిక్కి రావాలంటే సీఎం జగన్ కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పాలని అన్నారు.

Tags:    

Similar News