విశాఖపట్నం పరిశ్రమలను ప్రమాదాలు వెంటాడుతున్నాయి. పరవాడలోని సింహాద్రి ఎన్టీపీసీలో గురువారం ఘోర ప్రమాదం జరిగింది. కేబుల్ బెల్ట్ తెగిపోడంతో ఇద్దరు కార్మికులు అక్కడిక్కడే మృత్యువాత పడగా మరో ముగ్గురు తీవ్రంగా గాచయపడ్డారు. ఎన్టీపీసీలో ఎఫ్ జీడీ నిర్మాణ పనుల్లో ఈ విషాదం చోటుచేసుకుంది. మరమ్మతు పనుల్లో కార్మికులు కేబుల్ బెల్ట్ తెగడంతో 15 మీటర్ల ఎత్తు నుంచి కిందపడిపోయారు. మృతులు, క్షతగాత్రులు పశ్చిమ బెంగాల్ వాసులని వార్తలు వస్తున్నాయి. క్షతగాత్రులను తక్షణం ఆస్పత్రికి తలించారు. వారి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెప్పారు. అనకాపల్లి జిల్లా పరిధిలోకి వచ్చే సింహాద్రి ఎన్టీపీసీలో తరచూ ఏవో సమస్యలు తలెత్తుతున్నాయి. ఇటీవల లో 500 మెగావాట్ల సామర్థ్యం కలిగిన రెండో యూనిట్‌లో ఉత్పత్తి నిలిచిపోయింది. బాయిలర్ ట్యూబులకు రంధ్రాలు ఏర్పడడంతో ఈ సమస్య తలెత్తింది. కాలుష్య ప్రమాణాలను పాటించనందుకు ఏపీ కాలుష్య నియంత్రణ మండలి ఈ సంస్థకు నోటీసులు జారీ చేసింది.