Sivashankar Reddy. : వివేకా హత్య కేసు నిందితుడికి బెయిల్

Byline :  Vamshi
Update: 2024-03-11 12:44 GMT

వైఎస్ వివేకా హత్య కేసులో నిందితుడిగా ఉన్న దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డికి తెలంగాణ హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. షూరిటీగా రెండు లక్షలు సమర్పించాలని కోర్టు ఆదేశించింది.హైదరాబాద్ నగరం విడిచి వెళ్లకూడదని పాస్‌పోర్టూ సరెండర్ చేయాలని తెలిపింది. ప్రతి సోమవారం సీసీఎస్ పీఎస్‌లో హాజరవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. అలాగే ఏపీలోకి ఎట్టిపరిస్థితుల్లోనూ ప్రవేశించొద్దని హైకోర్టు షరతు విధించింది. వీటితో పాటు దేవిరెడ్డి పాస్ పోర్ట్‌ను సరెండర్ చేయాలని హైకోర్టు ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో రేపు దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి జైలు నుంచి విడుదలయ్యే అవకాశం ఉంది.

వివేకా గుండెపోటుతో చనిపోయాడని ప్రచారం చేయడంలో దేవిరెడ్డి శంకర్ రెడ్డి కీలకంగా వ్యవహరించారని సీబీఐ తెలిపింది. గుండెపోటుతో చనిపోయాడనే విషయాన్ని ప్రాపగాండ చేయడంలో శివశంకర్ రెడ్డి పాత్ర ఉన్నట్లు సీబీఐ తెలిపింది.వైఎస్ వివేకా 2019 ఎన్నికల సమయంలో దారుణ హత్యకు గురికావడం తెలిసిందే. ఈ కేసులో నిందితుడిగా భావించి దేవిరెడ్డి శివశంకర్ రెడ్డిని 2021 సెప్టెంబరు 17న హైదరాబాదులో అరెస్ట్ చేశారు.వివేకా హత్య కేసులో నలుగురు వ్యక్తులను నిందితులను చేరుస్తూ సీబీఐ ఛార్జిషీట్ వేసింది. ఎర్రగంగిరెడ్డి, సునీల్ యాదవ్, ఉమాశంకర్ రెడ్డి, దస్తగిరి పేర్లను ఛార్జిషీట్ లో చేర్చింది. వివేకా హత్య జరిగిన రోజు ఘటనకు సంబంధించిన ఆధారాలు, వివరాలు లేకుండా చేయడంలో పలువురి పాత్రపై ఇందులో సీబీఐ ప్రస్తావించింది




Tags:    

Similar News