Election Schedule : ఆంధ్రప్రదేశ్‌లో ఓట్ల లెక్కింపు కేంద్రాలపై సీఈవో సమీక్ష
ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ఎన్నికల సంఘం పూర్తి స్థాయిలో దృష్టి సారిస్తోంది. స్టాంగ్ రూమ్‌లు నిర్వహణపై రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేశ్ కుమార్ మీనా సమీక్ష నిర్వహించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లాల ఎన్నికల అధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు. ఓటర్ల నమోదు, మార్పులు, చేర్పులు, పోలింగ్ కేంద్రాల్లో కనీస వసతుల కల్పన తదితర అంశాలపై చర్చించారు. ఎన్నికల సమయంలో జరిగే అక్రమాల కట్టడికి తీసుకోవాల్సిన చర్యల గురించి అడిగి తెలుసుకున్నారు.
ఎలక్షన్ సమయంలో అక్రమ రవాణ కట్టడికి తీసుకోవాల్సిన చర్యల గురించి అడిగి తెలుసుకున్నారు.ఇప్పటికే పలు రాష్ట్రాల్లో పర్యటించిన ఎన్నికల కమిషనర్లు త్వరలోనే ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది..కాగా, మార్చి 13వ తేదీ తర్వాత ఏ క్షణంలోనైనా సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంది. ఎన్నికల ఏర్పాట్లపై ఎన్నికల కమిషనర్ల రాష్ట్రాల పర్యటన చివరి దశకు చేరుకుంది. మార్చి 12, 13న జమ్మూ కశ్మీర్ పర్యటన అనంతరం ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్ విడుదల చేసే అవకాశం ఉన్నట్టు సమాచారం