వలంటీర్ వ్యవస్థపై కోర్టుకు వెళ్తాం :పవన్

Update: 2023-07-11 16:39 GMT

ఏపీ వలంటీర్ వ్యవస్థపై పవన్ తన విమర్శలను ఆపడం లేదు. తీవ్ర విమర్శలతో ప్రతి మీటింగ్‌లోను వలంటీర్లను టార్గెట్ చేశారు. దీనిపై మరో ముందడగు వేసి వలంటీర్ వ్యవస్థపై న్యాయ పోరాటానికి పవన్ సిద్ధమయ్యారు. దీనిపై త్వరలో కోర్టుకు వెళతామని చెప్పారు. ఏలూరులో ఉంగుటూరు నియోజకవర్గ జనసేన నేతలు, వీరమహిళలతో సమావేశమైన పవన్.. మరోసారి సీఎం జగన్, వలంటీర్లపై విమర్శలు గుప్పించారు.

సంఘ విద్రోహ శక్తులకు వాలంటీర్ వ్యవస్థ తోడ్పాటు అందిస్తోందని పవన్ ఆరోపించారు. అసరమైన చోట వలంటీర్ వ్యవస్థను బలోపేతం చేయకుండా..అవసరం లేని వలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చారని విమర్శించారు. ప్రజల వ్యక్తిగత సమాచారంతో వారికి ఏం పని అని ప్రశ్నించారు. వాలంటీర్లు సేకరించిన సమాచారం ఎక్కడికి చేరుతుందని నిలదీశారు. వాలంటీర్ల రూపంలో ప్రతి 50 ఇళ్లకు ఒక జగన్ తయారయ్యాడని వ్యాఖ్యానించారు.ముఖ్యమంత్రికి పిండాకూడుకు, పిండివంటకు తేడా తెలియదని ఎద్దేవా చేశారు.అదే విధంగా వరాహికి వారాహికి తేడా తెలియదని జగన్ పై పవన్ సెటైర్లు వేశారు.

రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు..

ఈ నెల 9వ తేదీ రాత్రి ఏలూరులో జరిగిన సభలో వలంటీర్లపై పవన్ విమర్శలు చేశారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా వలంటీర్లు రోడ్డెక్కారు. పవన్ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేస్తు ఆందోళనకు దిగారు. పలు ప్రాంతాల్లో ఫ్లకార్డులు పట్టుకొని నిరసన వ్యక్తం చేయగా, మరికొన్ని ప్రాంతాల్లో పవన్‌ కల్యాణ్‌ దిష్టిబొమ్మను దహనం చేశారు. ప్రజలకు సేవలు అందిస్తున్న తమ పవన్ విమర్శలు చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ వలంటీర్లు డిమాండ్ చేశారు.

Tags:    

Similar News