వైసీపీలోకి ముద్రగడ వస్తానంటే ఆహ్వానిస్తాం :ఎంపీ మిథున్ రెడ్డి

Update: 2023-07-09 12:30 GMT

సీనియర్ రాజకీయ నేత, కాపు ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభం వైసీపీలో చేరుతారనే ప్రచారం జోరుగా కొనసాగుతోంది. ముద్రగడను పలువురు వైసీపీ నేతలు పార్టీలో చేరాల్సిందిగా కూడా ఆహ్వానించారు. తాజాగా ఈ అంశంపై రాజంపేట ఎంపి మిథున్ రెడ్డి స్పందించారు. ముద్రగడ వైసీపీలోకి వస్తానంటే ఆహ్వానిస్తామని తెలిపారు. ఆయన చేరిక పార్టీకి కూడా బలాన్ని ఇస్తుందని చెప్పారు.అయితే దీనిపై సీఎం జగన్ నిర్ణయం తీసుకోవాలన్నారు. ముద్రగడ గొప్ప నాయకుడని మిథున్ రెడ్డి కొనియాడారు.

చంద్రబాబును సీఎం చేయడానికే పవన్ కళ్యాణ్ పనిచేస్తున్నారని విమర్శించారు. జనసేన ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తుందో చెప్పాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రిని కానని గతంలో పవన్‌ చెప్పారన్నారు. అంత బలం తనకు లేదని స్వయంగా పవన్ అన్నారని గుర్తు చేశారు. కాపు ఎమ్మెల్యేలను తిడితే ఆ సామాజికవర్గంలో వ్యతిరేకత వస్తుందనే కారణంతోనే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిని పక్కా వ్యూహంతో టార్గెట్ చేశారని ఆరోపించారు. వైఎస్ఆర్‌‌సీపీలో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు అత్యధిక ప్రాధాన్యత ఉంటుందని అన్నారు. వైసీపీ ప్రభుత్వానికి ముందస్తు ఎన్నికలకు వెళ్లే ఆలచన లేదని స్పష్టం చేశారు. షెడ్యూల్‌ ప్రకారం లోక్‌సభ ఎన్నికలతో పాటే అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయని మిథున్ రెడ్డి వివరించారు.

We will invite Mudragada if he joins YCP: MP Mithun Reddy

senior political leader,Mudragada Padmanabham,joins YCp, Mithun Reddy invite Mudragada, cm jagan, pavan kalyan, janasena

Tags:    

Similar News