మచిలీపట్నం ఎమ్మెల్యే పేర్ని నాని కొడుకు వల్ల తన కుటుంబానికి ప్రాణహాని ఉందంటూ.. ఓ మహిళా కానిస్టేబుల్ ఆరోపించింది. తాడేపల్లిలోని సీఎం క్యాంపు ఆఫీస్ వద్ద ఆందోళనకు దిగింది. గత కొంత కాలంగా పేర్ని నాని కొడుకు కిట్టు.. సహా అతని అనుచరులు తనను తీవ్ర వేధింపులకు గురిచేస్తున్నారని వాపోయింది. మచిలీపట్నంలో 7వ వార్డ్ సచివాలయంలో పోలీసుగా పనిచేస్తున్న ఆవిడను.. కొంతకాలం కిందటే అధికారులు సస్పెండ్ చేశారని చెప్పుకొచ్చింది. ఈ విషయంపై ఆవిడ న్యాయపోరాటం చేయగా.. కోర్టు ఆ సస్పెన్షన్ ఎత్తేయాలని ఆదేశించింది. కోర్టు ఆదేశాలను లెక్క చేయని అధికారులు ఉద్యోగంలోకి చేర్చుకోవడం లేదని మండిపడింది. అంతేకాకుండా ఆవిడకు రావాల్సి రూ. 6 లక్షల జీతాన్ని ఆపేశారని వాపోయింది.