WTC final: టెస్ట్ ఛాంపియన్షిప్లో తెలుగు దేశం జెండాలు

Update: 2023-06-07 17:07 GMT

టీడీపీ యువగళం.. లండన్ వరకు పాకింది. భారత్, ఆస్ట్రేలియా మధ్య ఓవల్ వేదికపై జరుగుతోన్న వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ లో యువగళం జెండాలు దర్శనమిచ్చాయి. ఫైనల్ మ్యాచ్ చూడటానికి వచ్చిన తెలుగు యవత.. గ్రౌండ్ లో సందడి చేసింది. బ్రిటన్ లోని ఎన్ఆరై సభ్యులు యువగళం జెండాలు చేతిలో పట్టుకుని నినాదాలు చేశారు. ఆంధ్యప్రదేశ్ లో పాదయాత్ర చేస్తున్న నారా లోకేష్ కు లండన్ నుంచి మద్దతునిచ్చారు. జై లోకేశ్, జై టీడీపీ, జై ఎన్టీఆర్ అంటూ నినాదాలు చేశారు. దీంతో అక్కడి కెమెరామెన్ లు.. వీళ్లపై ఓ లుక్కేశారు. దాంతో సోషల్ మీడియాలో వైరల్ అయ్యారు అక్కడి తెలుగు యువత.

Tags:    

Similar News