వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా వైసీపీ ప్రణాళిక సిద్దం చేస్తోంది. ఈ క్రమంలో పలు నియోజకవర్గాలకు పార్టీ ఇంఛార్జిలను మార్చింది. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణ రెడ్డి రాజీనామాతో పార్టీ పలు కీలక మార్పులకు శ్రీకారం చుట్టింది. 11 నియోజకవర్గాలకు కొత్త ఇంచార్జ్లను నియమించినట్లు సజ్జల తెలిపారు. అన్నీ స్థానాల్లో వైసీపీ గెలవాలని..దాని కోసం జగన్ ఆచితూచి అడుగులేస్తున్నారని చెప్పారు. అవసరాన్ని బట్టి భవిష్యత్తులో కూడా మార్పులు ఉంటాయని వివరించారు.
మంగళగిరి-గంజి చిరంజీవి, గుంటూరు పశ్చిమ- విడదల రజిని, పత్తిపాడు - బాలసాని కిషోర్ కుమార్, వేమూరు- అశోక్‌బాబు, సంతనూతలపాడు -మేరుగ నాగార్జున, తాడికొండ-మేకతోటి సుచరిత, కొండెపి -ఆదిమూలపు సురేష్, చిలకలూరిపేట- రాజేష్ నాయుడు, అద్దంకి -పాణెం హనిమిరెడ్డి, రేపల్లె -ఈవూరు గణేష్, గాజువాక-వరికూటి రామచంద్రరావులను నియమించినట్లు సజ్జల తెలిపారు. రేపటి నుంచి ఆయా నియోజకవర్గాల్లో పార్టీ వ్యవహారాలను వీరంతా పర్యవేక్షిస్తారన్నారు. పార్టీ ఎవరినీ వదులుకోదని.. అందరి సేవలనూ వినియోగించుకుంటామని తెలిపారు.