ఏపీలో గత కొద్ది రోజులుగా ముందస్తు ప్రచారం ఊపందుకుంది. ఎవరికి వారే స్పీడ్ పెంచడంతో ముందస్తు ఎన్నికలు వస్తాయంటూ జోరుగా ప్రచారం సాగుతోంది. సీఎం జగన్మోహన్ రెడ్డి వరుస ఢిల్లీకి వెల్లడం, మరోవైపు మహానాడు వేదికగా మేనిఫెస్టో టీడీపీప్రకటించడంతో పాటు.. ఇటీవల బీజేపీ పెద్దలు అమిత్ షా, జేపీ నడ్డాలతో చంద్రబాబు భేటీ కావడంతో ఎన్నికలు వచ్చేస్తున్నాయంటూ రూమర్లు ఎక్కువయ్యాయి. ఈ క్రమంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ముందస్తు ఎన్నికల ఊహాగానాలన్ని ఆయన ఖండించారు. వైసీపీ ప్రభుత్వానికి ముందుస్తుకు వెళ్లే ఆలోచన లేదని స్పష్టం చేశారు. పార్లమెంట్ ఎన్నికలతో పాటే అసెంబ్లీ ఎన్నికలకు కూడా వెళ్తామన్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా వైసీపీ సింగిల్ గా పోటీ చేస్తుందని తెలిపారు. చంద్రబాబు మాదిరిలా ఇతరులపై ఆధారపడమని వివరించారు.రాజకీయంగా అంగవైకల్యంతో చంద్రబాబు బాధపడుతున్నారని పెద్దిరెడ్డి విమర్శించారు. పవన్ కల్యాణ్ కోసం మాట్లాడేందుకు ఏమీ లేదన్నారు.