YS Sharmila : రాజారెడ్డి నిశ్చితార్థ వేడుకలో అన్నతో అంటీ ముట్టనట్టుగా వైఎస్ షర్మిల

Update: 2024-01-19 01:23 GMT

ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల తనయుడి రాజారెడ్డి నిశ్చితార్ధ వేడుకకు ముఖ్యమంత్రి జగన్ హాజరయ్యారు. హైదరాబాద్ లోని గోల్కొండ రిసార్ట్స్ లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు హాజరయ్యారు. వేడుకలో పాల్గోనేందకు సాయంత్రం రిసార్ట్స్ చేరుకున్న జగన్..తన భార్య భారతితో కలిసి నేరుగా వేదిక వద్దకు వెళ్లారు. అంత ముందుకు తల్లి విజయమ్మను ఆప్యాయంగా ఆప్యాయంగా హత్తుకున్నారు. పక్కనే ఉన్న షర్మిలను పలకరించి కాబోయే వధూవరులకు విషెస్ చెప్పారు. తర్వాత పుష్పగుచ్ఛం ఇస్తుండగా గ్రూపు ఫొటో తీసే సమయంలో షర్మిల దూరంగా ఉండటం గమనించి దగ్గరకు రావాలని జగన్ పిలిచారు. ఆమె భర్త బ్రదర్ అనిల్‌ కూడా అంటీముట్టనట్టుగానే కనిపించారు. ఫొటో కోసం రావాలని రెండోసారి మళ్లీ పిలిచినా రాలేదు. మూడోసారి పిలిచాకే.. వచ్చి విజయమ్మ పక్కన నిల్చుని ఫొటో దిగారు. తర్వాత షర్మిలను, తల్లి విజయమ్మను పలకరించిన జగన్‌.. అక్కడి నుంచి వెళ్లిపోయారు. సీఎం వెంట ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, వైవీ సుబ్బారెడ్డి ఉన్నారు. జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ కూడా ఈ నిశ్చితార్థ వేడుకకు విచ్చేశారు. త్వరలో ఒక్కటి కాబోతున్న రాజారెడ్డి, అట్లూరి ప్రియలకు పవన్ కల్యాణ్ శుభాకాంక్షలు తెలియజేశారు. షర్మిల, అనిల్, రాజారెడ్డి, అట్లూరి ప్రియలతో కలిసి పవన్ ఫొటోలకు పోజులిచ్చారు. కాగా, పవన్ రాకతో గోల్కండ రిసార్ట్స్ లో కోలాహలం నెలకొంది. ఇప్పటికే అందరికీ ఇన్విటేషన్‌ కార్డులను కూడా షర్మిల అందజేశారు. ఫిబ్రవరి 17న రాజారెడ్డి, అట్లూరి ప్రియల వివాహం జరగనుంది.




 






 




 



Tags:    

Similar News