అరుదైన ఘనత సాధించిన మహిళగా షర్మిల రికార్డ్

Update: 2023-08-15 12:50 GMT

వైఎస్​ఆర్​టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అరుదైన రికార్డ్ ను నెలకొల్పారు. తెలంగాణలో షర్మిల చేసిన చేసిన పాదయాత్రకు గానూ అరుదైన గౌరవం దక్కింది. ఈ పాదయాత్రలో మొత్తం 3,800 కిలోమీటర్లు నడిచిన షర్మిల.. సుదీర్ఘంగా ఇంత దూరం నడిచిన తొలి మహిళగా ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు దక్కించుకున్నారు. 2021 అక్టోబర్ 20న చేవెళ్ల నుంచి పాదయాత్ర మొదలుపెట్టి దాదపు ఏడాదిన్నరపాటు ఈ పాదయాత్ర కొనసాగించారు. ఈ సందర్భంగా ఆగస్టు 15న షర్మిలకు ఈ అరుదైన గౌరవం దక్కడం విశేషం.




 


పాదయాత్ర వేళ షర్మిలకు ఎన్నో అడ్డంకులు ఎదురయ్యాయి. అధికార పార్టీ నేతలు ఎన్నో ఆరోపణలు చేశారు. కార్యకర్తలు యాత్ర కొనసాగకుండా అడ్డుకున్నారు. పోలీసులు పర్మిషన్ ను నిరాకరించారు. అవన్నీ ఎదుర్కున్న షర్మిల కోర్ట్ ద్వారా నోటీస్ తెచ్చుకుని పాదయాత్ర కొనసాగించింది. వరంగల్ నర్సంపేట్ లో జరిగిన ఉద్రిక్త పరిస్థితుల వల్ల పోలీసులు అరెస్ట్ కూడా చేశారు. కొన్నాళ్లు యాత్రకు బ్రేక్ పడగా.. హైకోర్ట్ నుంచి అనుమతి తెచ్చుకుని పాదయాత్రను కొనసాగించారు. గతంలో ఆంధ్రప్రదేశ్ లో కూడా షర్మిల పాదయాత్ర చేశారు. ఈ క్రమంలో అవార్డ్ అందుకున్న షర్మిలను పార్టీ ప్రతినిధులు, కార్యకర్తలు అభినందనలు తెలుపుతున్నారు.




 



Tags:    

Similar News