రాహుల్కు షర్మిల థ్యాంక్స్.. పార్టీ విలీనంపై చర్చ..!

Update: 2023-07-08 14:03 GMT

ఇవాళ వైఎస్సార్ జయంతి. ఈ క్రమంలో పలువురు ప్రముఖులు ఆయనకు నివాళులు అర్పించారు. రాహుల్ గాంధీ సైతం వైఎస్సార్కు ట్విట్టర్ వేదికగా నివాళులు అర్పించారు. వైఎస్సార్ విజినరీ లీడర్ అని.. ఏపీ ప్రజల అభ్యున్నతి కోసం తన జీవితాన్ని అంకితం చేసిన గొప్ప నేత అని కొనియాడారు. వైఎస్సార్ చిరస్మరణీయ నేత అంటూ రాహుల్ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్కు వైఎస్సార్టీపీ చీఫ్ వైఎస్ షర్మిల రిప్లై ఇచ్చారు.

వైఎస్సార్ను గుర్తుచేసుకున్నందుకు రాహుల్కు షర్మిల థ్యాంక్స్ చెప్పారు. ‘‘రాహుల్ గాంధీ నాయకత్వంలో దేశానికి ఉజ్వల భవిష్యత్ ఉంటుందని వైఎస్సార్‌ విశ్వసించారు. నాడు వైఎస్ అమలు చేసిన పథకాలే ఈ రోజుకూ దేశవ్యాప్తంగా సంక్షేమ పాలనకు మార్గదర్శకాలుగా నిలుస్తున్నాయి. వైఎస్సార్ ను మీ గుండెల్లో పెట్టుకున్నందుకు ధన్యవాదాలు సర్ అని రిప్లై ఇచ్చారు. ప్రస్తుతం ఈ ట్వీట్ చర్చనీయాంశంగా మారింది.

గత కొద్దిరోజులుగా కాంగ్రెస్లో తన పార్టీని షర్మిల విలీనం చేస్తారనే ప్రచారం జరుగుతోంది. బెంగళూరులో డీకే శివకుమార్తో భేటీ తర్వాత ఈ చర్చ మరింత ఎక్కువైంది. అంతకుముందు రాహుల్ బర్త్ డే సందర్భంగా విషెస్ చెప్పడం, ప్రస్తుతం రాహుల్ పోస్ట్ కు రిప్లై ఇవ్వడం ఈ ప్రచారానికి మరింత బలాన్ని చేకూర్చుతోంది. షర్మిల ట్వీట్‌తో కాంగ్రెస్‌లో వైఎస్సార్‌టీపీ విలీనం ఖాయమైందని.. అందుకు ఈ ట్వీట్ నిదర్శమని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. అయితు వైఎస్సార్ మరణం తర్వాత ఆయన కుటుంబానికి, కాంగ్రెస్ పార్టీకి సత్సబంధాలు లేవు. తాజాగా షర్మిల కాంగ్రెస్ వైపు చూస్తుందనే వార్తలు రాజకీయాల్లో ఆసక్తిని పెంచుతోంది.

Tags:    

Similar News