YS Sharmila : అనారోగ్యం నుంచి కోలుకున్న వైఎస్ షర్మిల.. ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధం

Update: 2024-02-07 06:05 GMT

(YS Sharmila) ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అనారోగ్యంతో బాధపడుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆమె కోలుకుంటున్నారు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం దేశ రాజధాని ఢిల్లీలో ఆమె ఆందోళన చేపట్టారు. ఆ సమయంలోనే షర్మిల అనారోగ్యానికి గురయ్యారు. వైరల్ ఫీవర్‌తో పాటుగా గొంతునొప్పితో బాధపడుతున్న ఆమె కొద్ది రోజులు విశ్రాంతి తీసుకున్నారు. వైద్యుల సూచన మేరకు రాజకీీయాలకు దూరంగా ఉంటూ ఇంటికే పరిమితమయ్యారు. ప్రస్తుతం ఆమె అనారోగ్యం నుంచి కోలుకుని రాష్ట్రంలో పర్యటించి ప్రజల్లోకి వెల్లేందుకు సిద్దమయ్యారు.

వైఎస్ షర్మిలకు అనారోగ్య కారణంగా వల్ల ఫిబ్రవరి 5వ తేది నుంచి జరగాల్సిన రచ్చబండ కార్యక్రమం వాయిదా పడింది. ప్రస్తుతం అనారోగ్యం నుంచి ఆమె పూర్తిగా కోలుకున్నారు. దీంతో బుధవారం నుంచి ఆమె ఐదు రోజుల పాటు పలు నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. రేపు బాపట్లలో కాంగ్రెస్ నిర్వహిస్తున్న బహిరంగ సభలో షర్మిల పాల్గొననున్నారు. ఫిబ్రవరి 8న తెనాలిలో రచ్చబండ, ఆ రోజు సాయంత్రం ఉంగుటూరు బహిరంగ సభలో పాల్గొంటారు. అదేవిధంగా 9న కొవ్వూరు రచ్చబండ, తుని బహిరంగ సభలో, 10న నర్సీపట్నం, పాడేరులో, 11న నగరి బహిరంగ సభలో ఆమె ప్రసంగించనున్నారు.

ఫిబ్రవరి 12వ తేది నుంచి 20వ తేది వరకూ తన కుమారుడు రాజారెడ్డి పెళ్లి పనుల్లో వైఎస్ షర్మిల బిజీగా ఉండనున్నారు. జనవరి నెలలో రాజారెడ్డి - ప్రియల నిశ్చితార్థం జరిగిన సంగతి తెలిసిందే. కొడుకు పెళ్లి ఏర్పాట్లను షర్మిల దగ్గరుండి చూసుకోనున్నారు. కుమారుడి వివాహం అనంతరం తిరిగి ఫిబ్రవరి 21వ తేదిన రచ్చబండ, బహిరంగ సభల్లో వైఎస్ షర్మిల యధావిధిగా పాల్గొననున్నారు.  


Tags:    

Similar News