హైదరాబాద్ లో ఇళ్లు అమ్ముడు పోవటం లేదు. 38శాతం అమ్ముడుపోని జాబితాలో ఉన్నాయి. అదే విధంగా దేశంలోని ఎనిమిది ప్రధాన నగరాల్లో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. ప్రాజెక్ట్ ల లాంచింగ్ లు పెరగడం వల్ల ఈ విధంగా జరుగుతుందని నిపుణులు చెప్తున్నారు. గతేడాదితో పోల్చితే.. అమ్ముడు పోని ఇళ్లు 12 శాతం మేర పెరిగాయి. అందులో 95 శాతం యూనిట్లు నిర్మాణ దశలో ఉన్నవే. హైదరాబాద్ లో గచ్చబౌలి, కొండాపూర్, నానక్ రాంగూడ, కోకాపేట ప్రాంతాల్లో భారీ స్థాయిలో ఇళ్ల నిర్మాణాలు జరగడమే ఇందుకు కారణం. కొత్తింటికి డిమాండ్ పెరిగిన నేపథ్యంలో 8 నగరాల్లో ఇళ్ల ధరకు 8 శాతం పెరిగాయి. 2023లో హైదరాబాద్ లో 13 శాతం రేట్లు పెరిగాయి. ఇళ్ల ధరలు పెరిగిన నగరాల్లో మొదటి స్థానంలో ఢిల్లీ 16 శాతం, కోల్ కతా 15 శాతం, బెంగళూరు 14 శాతం ఉన్నాయి.