రిలీజ్కు ముందే జియో 5జీ ఫోన్ ఫొటోలు లీక్.. మరీ ఇంత చీపా?

Update: 2023-06-23 13:02 GMT

జీయో.. గూగుల్ తో కలిసి 5జీ స్మార్ట్ ఫోన్ ను తీసుకొస్తున్న విషయం తెలిసిందే. దీంతో ఈ దేశీ ఫోన్ పై భారీ అంచాలు నెలకొన్నాయి. అద్భుతమైన స్పెసిఫికేషన్స్, ఫీచర్స్ తో.. అతి తక్కువ ధరలో ఈ ఫోన్ రాబోతున్నట్లు ఇప్పటి వరకు చాలా రూమర్స్ వచ్చాయి. ఆ రూమర్స్ నిజమనిపించేలా.. జీయో 5జీ స్మార్ట్ ఫోన్ లుక్స్ సోషల్ మీడియాలో లీక్ అయ్యాయి.

లీక్ అయిన స్పెసిఫికేషన్స్ ఆధారంగా.. ఇందులో 13 మెగా పిక్సల్ ఏఐ కెమెరా, 2 ఎంపీ సెకండరీ కెమెరా, 5 ఎంపీ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాతో వస్తుంది. ఫైబర్ ప్లాస్టిక్ తో తయారైన బాడీ, 5జీ యూనిసాస్‌ ప్రాసెసర్‌, డైమన్సిటీ 700 ఎస్‌ఓఎస్‌తో లాంచ్ అవుతుంది. దీపావళి కానుకగా కాబోతున్న ఈ ఫోన్ కేవలం రూ.12,000 ఉన్నట్లు తెలుస్తోంది. ఇదివరకు లీక్ అయిన స్పెసిఫికేషన్స్ ప్రకారం.. ఈ ఫోస్ 4జీబీ ర్యామ్, 32 జీబీ ఇంటర్నల్ మెమరీతో.. స్నాప్ డ్రాగన్ 480 ప్రాసెసర్ తో వస్తుంది.

6.5 డిస్ ప్లే, 90 హెడ్జ్ రిఫ్రెష్ రేట్ తో లాంచ్ అవుతుంది. ఆండ్రాయిడ్ 12 సపోర్ట్ ఉంటుంది. 18 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీతో రానుంది. ఈ ఫోన్ లో గూగుల్ సర్వీసెస్, జియో యాప్స్ అన్నీ ఇన్ బిల్ట్ గా వస్తాయి. దిపావళికి ఈ ఫోన్ తో పాటు తక్కవ ధరలో జియో ల్యాప్ టాప్ ను కూడా లాంచ్ చేస్తుంది.


Tags:    

Similar News