రూ. 49కే లక్ష ఇన్సూరెన్స్.. గుడ్ న్యూస్ చెప్పిన ఫోన్ పే
ఫోన్ పే గుడ్ న్యూస్ చెప్పింది. అతితక్కువ ధరకే యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ ప్లాన్ అందుబాటులోకి తీసుకొచ్చింది. 49 రూపాయలకే లక్ష ఇన్సూరెన్స్ పాలసీని తెచ్చింది. తక్కువ డాక్యుమెంట్లతోనే మీరు ఈ పాలసీ పొందొచ్చు. 8 నుంచి 65 ఏళ్ల వయస్సు ఉన్న వారు ఈ పాలసీ తీసుకోవడానికి అర్హులు. ప్రమాదవశాత్తు మరణిస్తే నామినీకి బీమా మొత్తం చెందుతుంది.
ఎలాంటి హెల్త్ చెకప్స్ అవసరం లేకుండానే ఈ పాలసీ తీసుకోవచ్చు. యాక్సిడెంటల్ పాలసీని 50 వేల నుంచి రూ. 20 లక్షల వరకు ఎంతైనా తీసుకోవచ్చు. రూ. 50 వేల బీమా మొత్తానికి రూ.20 ప్రీమియం మాత్రమే చెల్లించాలి. రూ. లక్ష బీమాకు 49 ప్రీమియం, ఇక రూ. 5 లక్షల బీమాకు 249, 10 లక్షల బీమాకు రూ. 549, రూ. 20 లక్షల బీమాకు 1099 ప్రీమియం కట్టాలి. వీటిల్లో మీకు నచ్చిన పాలసీ తీసుకోవచ్చు.
సహజ మరణానికి మాత్రమే ఈ పాలసీ వర్తిస్తుంది. మరణించినా, కంటి చూపు కోల్పోయినా, శాశ్వత అంగ వైకల్యం వచ్చినా ఈ పాలసీ వర్తిస్తోంది. అయితే సూసైడ్, యుద్ధం, డ్రగ్స్ తీసుకుని మరణిస్తే ఎటువంటి బీమా వర్తించదు. రిలయన్స్ జనరల్ ఇన్సూరెన్స్ భాగస్వామ్యంతో ఫోన్ పే ఈ పాలసీని అందిస్తోంది. ప్రతి ఏటా పాలసీని రెన్యూవల్ చేసుకోవలసి ఉంటుంది.