VIVO నుంచి కొత్త ఫోన్.. అదిరిపోయే ఫీచర్స్తో, అందుబాటు ధరలో

Update: 2023-06-23 11:51 GMT

మార్కెట్ లో ప్రస్తుతం 5జీ ట్రెండ్ నడుస్తున్నా.. 4జీ ఫోన్స్ లకు కూడా మంచి డిమాండ్ ఉంది. ఆ డిమాండ్ ను క్యాష్ చేసుకునేందుకు ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ వివో.. వివో వై36 4జీ పేరుతో సరికొత్త మొబైల్ ను మార్కెట్ లోకి తీసుకురానుంది. గ్లాస్ ఫినిష్ తో వస్తున్న ఈ మొబైల్.. ఏకంగా 16 జీబీ ర్యామ్ తో లాంచ్ అవుతుంది.

స్పెసిఫికేషన్స్..:

పంచ్ హోల్ డిస్ ప్లే, 6.64 అంగుళాల స్క్రీన్ తో వస్తున్న ఈ ఫోన్.. 90 హెడ్జ్ డిస్ ప్లే తో రాబోతోంది. 50 ఎంపీ డ్యూయెల్ రియర్ కెమెరా, 16 ఎంపీ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఇందులో మెయిన్ హైలైట్. క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 680 ప్రాసెసర్, 8 జీబీ ర్యామ్ తో.. మరో 8జీబీ ఎక్స్‌టెండెడ్ ర్యామ్ టెక్నాలజీ ఇందులో ఉండనుంది. దీనివల్ల యూజర్ కు మొత్తం 16 జీబీ వరకు ర్యామ్ లభిస్తుంది. 256 జీబీ ఇంటర్నల్ మెమరీ ఉంటుంది. 44 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో 5000 ఎంఏహెచ్ బ్యాటరీతో రానుంది. ఆండ్రాయిడ్ 13తో ఫన్ టచ్ ఓఎస్ తో ఈ ఫోన్ లాంచ్ అవుతుంది.

ఫీచర్లివే:

తక్కువ ధరలో వస్తున్న ఈ ఫోన్.. వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్ తో వస్తుంది. అంతేకాకుండా.. ఇందులో బ్లూటూత్ 5.1, 1 టీబీ వరకు మైక్రో ఎస్ డీ కార్డ్ సపోర్ట్ చేస్తుంది. ప్రస్తుతం వస్తున్న 5జీ ఫోన్లకు ఏ మాత్రం తీసిపోని స్పెసిఫికేషన్స్, ఫీచర్స్ తో వస్తుంది.

Tags:    

Similar News