హిందీ ట్రాన్స్‌లేటర్స్ పోస్టులు పడ్డాయ్.. జీతం రూ. 1.42 లక్షలు
వివిధ కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో 307 పోస్టులకు ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. హిందీ లేదా ఇంగ్లిష్‌లలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి, అనుభవం సంపాదించిన వారు అర్హులు. డిగ్రీలో హిందీ, ఇంగ్లీష్ ఒక పాఠ్యాంశంగా చదివి, హిందీ నుంచి ఆంగ్లంలోకి అనువాదం చేయడంతో డిప్లొమా లేదా సర్టిఫికేట్ కోర్స్ పూర్తిచేసి ఉండాలి. స్టాఫ్ సెలక్షన్ కమిషన్(ఎస్ఎస్సీ) ఈ పోస్టులను భర్తీ చేస్తుంది. జూనియర్ హిందీ ట్రాన్స్లేటర్ పోస్టులు 10, జూనియర్ ట్రాన్స్లేటర్ పోస్టులు 287, సీనియర్ హిందీ ట్రాన్స్లేటర్ పోస్టులు 10 ఖాళీగా ఉన్నాయి.
అభ్యర్థులు ఏదైనా కేంద్ర ప్రభుత్వం సంస్థలో అనువాదంలో రెండేళ్ల అనుభవం గడిచి ఉండాలి. వయోపరిమితి 18 నుంచి నుంచి 30 ఏళ్ల మధ్య. నిబంధనల ప్రకారం రిజర్వేషన్ అభ్యర్థులకు సడలింపు ఉంటుంది. అర్హత గల అభ్యర్థులకు టైర్ - 1, టైర్ – 2 రాతపరీక్షలు నిర్వహిస్తారు. వీటిలో పాసైన వారు సర్టిఫికెట్ల వెరిఫికేషన్, వైద్య పరీక్షలు చేయించుకోవాలి. జూనియర్ హిందీ ట్రాన్స్లేటర్ జీతం రూ.35,400 – రూ.1,12,400, జూనియర్ ట్రాన్స్లేటర్ జీతం రూ.35,400 – రూ.1,12,400, సీనియర్ హిందీ ట్రాన్స్లేటర్ జీతం రూ.44,900 – రూ.1,42,400 మధ్య ఉంటుంది. దరఖాస్తు చేసుకోవడానికి గడువు తేదీ సెప్టెంబర్ 12. దరఖాస్తులను సెప్టెంబర్ 13, 14 తేదీల్లో సవరించుకోవచ్చు. అక్టోబర్ 16న ఉంటుంది.