తెలంగాణలో మరో 8 కొత్త మెడికల్ కాలేజీలు

Update: 2023-07-05 12:29 GMT

తెలంగాణలో ప్రతి జిల్లాకు ఓ మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయడమే లక్ష్యాన్ని కేసీఆర్ సర్కార్ అందుకుంటోంది. తాజాగా మరో 8 కొత్త మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. యాదాద్రి భువ‌న‌గిరి, రంగారెడ్డి, మేడ్చ‌ల్ మ‌ల్కాజ్‌గిరి, జోగులాంబ గ‌ద్వాల‌, నారాయ‌ణ‌పేట్, మెద‌క్, ములుగు, వ‌రంగ‌ల్ జిల్లాల్లో కొత్త మెడిక‌ల్ కాలేజీల‌ ఏర్పాటుకు అనుమతి ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ప్ర‌తి జిల్లాకు ఒక ప్ర‌భుత్వ మెడిక‌ల్ కాలేజీ క‌లిగిన ఏకైక రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది. కొత్త వాటితో కలిపి రాష్ట్రంలో ఎంబీబీఎస్‌ సీట్లు పది వేలకు చేరువకానున్నాయి.



ఈ 9 ఏండ్ల కాలంలో 29 కొత్త ప్ర‌భుత్వ మెడిక‌ల్ కాలేజీల‌ను ఏర్పాటు చేసింది.




 



Tags:    

Similar News