2 Board Exams: ఏడాదికి 2 బోర్డ్ ఎగ్జామ్స్.. కేంద్ర విద్యాశాఖ ఏం చెప్తుందంటే?

Byline :  Bharath
Update: 2023-10-08 13:16 GMT

కేంద్ర ప్రభుత్వం నూతన విద్యా విధానాన్ని ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఈ నూతన విద్యా విధానానికి గానూ పది, 12వ తరగతి విద్యార్థులు ఏడాదికి రెండు సార్లు బోర్డ్ ఎగ్జామ్స్ రాయాల్సి ఉందని మొదట్లో ప్రకటించారు. అయితే తాగాజా ఏడాదికి రెండు బోర్డ్ ఎగ్జామ్స్ రాయడం తప్పనిసరేం కాదని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు. ఎక్కువ మార్కులు తెచ్చుకునే ఒకే ఒక అవకాశం ఉందని విద్యార్థులు ఆందోళన చెందుతుంటారు. వాళ్లలో ఒత్తిడిన తగ్గించేందుకు రెండుసార్లు బోర్డ్ ఎగ్జామ్స్ రాసుకునే విధానాన్ని ప్రవేశపెట్టింది కేంద్రం. విద్యార్థుల్లో ఒత్తిడి తగ్గించేందుకు పాఠ్య పుస్తకాల ప్రణాళికలను రూపొందించినట్లు కేంద్ర విద్యాశాఖ ప్రకటించింది.

రెండుసార్లు బోర్డ్ ఎగ్జామ్స్ రాసే స్టూడెంట్స్ ఏ పరీక్షల్లో ఎక్కువ మార్కులు సాధిస్తారో వాటినే తుది మార్కులుగా పరిగణంలోకి తీసుకుంటారు. అలాగే, జాతీయ విద్యా విధానం 2020కి అనుగుణంగా కొత్త పాఠ్య పుస్తకాల ప్రణాళిక రూపొందించారు. 2024 నుంచి ఆ పాఠ్య పుస్తకాలను తీసుకురానున్నారు. ఈ నిర్ణయంపై అందరి నుంచి సానుకూల అభిప్రాయాలు వచ్చినట్లు మంత్రి ధర్మేంద్ర చెప్పారు. కాగా కొత్త విద్యావిధానాన్ని తప్పని సరిగా 2024 నుంచి అమలు పరుస్తామని ధర్మేంద్ర చెప్పుకొచ్చారు.




Tags:    

Similar News