రేపే గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష.. అభ్యర్థులు ఇవి కచ్చితంగా పాటించండి.. లేదంటే

Update: 2023-06-10 03:10 GMT

గొడవలు, నిరసనలు, పిటిషన్ల మధ్య గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష నిర్వహనకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దాంతో రేపు (జూన్ 11) ప్రిలిమినరీ పరీక్ష నిర్వహనకు రంగం సిద్ధం అయింది. పరీక్ష రాసే అభ్యర్థులకు ఎలాంటి ఆటంకం కలుగకుండా అధికారులు పూర్తి ఏర్పాట్లు చేశారు. రాష్ట్రంలోని 503 పోస్టుల భర్తీకి.. దాదాపు మూడున్నర లక్షల మంది అభ్యర్థులు దరకాస్థు చేసుకున్నారు. 2022 అక్టోబర్ 16న ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించగా.. పేపర్ లీక్ కారణంగా రద్దయింది. దాంతో తిరిగి మళ్లీ పరీక్ష నిర్వహిస్తున్నారు.

ఈ పరీక్షకు సంబంధించిన హాల్ టికెట్లు.. వెబ్ సైట్ లో అందుబాటులో ఉన్నాయి. రేపు (జూన్ 11) ఉదయం 10:30 గంటలకు ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది. మధ్యహ్నం ఒంటి గంటకు పూర్తవుతుంది. ఈ క్రమంలో ఉదయం 10: 15 గంటల వరకే ఎగ్జామ్ హాల్ లోకి అనుమతిస్తారు. అభ్యర్థులకు సూచనలు ఇచ్చేందుకు జిల్లాకొక హెల్ప్ లైన్ చొప్పున మొత్తం 33 హెల్ప్ లైన్ సెంటర్లను ఏర్పాటు చేశారు అధికారులు.

ఇక గ్రూప్ 1 పరీక్ష ప్రశాంతంగా జరిగేలా చూసేందుకు పోలీస్ లు పటిష్ట భద్రత తీసుకుంది. పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 144 ను అమలు చేయనున్నారు. ఆదివారం ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటల వరకు అన్ని పరీక్ష కేంద్రాల వద్ద పోలీస్ ఆంక్షలు అమల్లో ఉంటాయి.

Tags:    

Similar News