తెలంగాణలో వరుస ఉద్యోగాల నోటిఫికేషన్లు వెలువడుతున్నాయి. ప్రధానంగా వైద్యారోగ్య శాఖలో ఉద్యోగాల జాతర కొనసాగుతుంది. తాజాగా మరో ఉద్యోగ నోటిఫికేషన్ వెలువడింది. ఆరోగ్య, కుటుంబ సంక్షేమ కమిషనర్ పరిధిలో 1520 మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్ (ఫిమేల్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ అయ్యింది. ఈ మేరకు మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు ప్రకటనను విడుదల చేసింది.
ఆగస్టు 25 ఉదయం 10.30 గంటల నుంచి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం కానుంది. సెప్టెంబర్ 19 సాయంత్రం 5 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు తెలిపింది. mhsrb.telangana.gov.in వెబ్సైట్ ద్వారా ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. ఉద్యోగ నోటిఫికేషన్‌పై మంత్రి హరీశ్ రావు హర్షం వ్యక్తం చేశారు.వైద్యారోగ్య శాఖలో ఉద్యోగాల జాతర కొనసాగుతుందని ట్వీట్ చేశారు. ఆశావహులందరికీ శుభాకాంక్షలు తెలిపారు.