ఆంధ్రప్రదేశ్‌లో ఉమ్మడి ప్రవేశ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. ఇంజినీరింగ్, ఫార్మసీ ప్రవేశాలకు నిర్వహించే EAPCET- 2024 పరీక్ష షెడ్యూల్ ను ఉన్నత విద్యా మండలి విడుదల చేసింది. EAPCETను మే 13 నుంచి 19వ తేదీ వరకు నిర్వహించనున్నారు. ECET పరీక్షను మే 8వ తేదీన, ICET పరీక్షను మే 6వ తేదీన, PGECETను మే 29 నుంచి 31వ తేదీ వరకు నిర్వహిస్తారు. అదేవిధంగా.. ఎడ్ సెట్ ను జూన్ 8న, లాసెట్ ను జూన్ 9న, PGCETను జూన్ 3 నుంచి 7వ తేదీ వరకు, ADCETను జూన్ 13న నిర్వహించనున్నట్లు ప్రకటించింది. PECET ప్రవేశ పరీక్ష తేదీని త్వరలోనే ప్రకటిస్తామమని ఏపీ విద్యాశాఖ తెలిపింది.