Group 2 Application Date : గ్రూప్ 2 అభ్యర్థులకు గుడ్ న్యూస్.. దరఖాస్తు గడువు పొడగింపు

Byline :  Bharath
Update: 2024-01-10 11:51 GMT

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రూప్ 2 అభ్యర్థులకు గుడ్ న్యూస్ చెప్పింది. గ్రూప్ 2 ఉద్యోగాల భర్తీకి దరఖాస్తుల గడువు పొండగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దరఖాస్తు గడువు పెంచాలని అభ్యర్థుల నుంచి వచ్చిన విజ్ఞప్తులను పరిగణంలోకి తీసుకున్న ఏపీపీఎస్సీ.. గడువును వారం రోజులు పెంచుతున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు అభ్యర్థులు జనవరి 17 అర్ధరాత్రి 11:59 గంటల వరకు దరఖాస్తు చేసుకోవచ్చని ఏపీపీఎస్సీ తెలిపింది. కాగా ఫిబ్రవరి 25న జరిగే ప్రిలిమినరీ పరీక్ష తేదీలో మాత్రం ఎలాంటి మార్పు లేదని స్పష్టం చేసింది. దరఖాస్తు గడువు ఇవాళ్టితో ముగియాల్సి ఉంది.

అయితే ఏపీపీఎస్సీ సర్వర్ లో సాంకేతిక సమస్యలు తలెత్తి.. అప్లై చేసుకోవడం ఇబ్బందిగా మారిందని, వాటిని సరిచేసి గడువు పెంచాలని అభ్యర్థులు విజ్ఞప్తి చేశారు. దీంతో ప్రభుత్వం గడువు పెంచింది. గతేడాది డిసెంబర్ లో మొత్తంలో 897 పోస్టుల భర్తీకి గ్రూప్ 2 నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో 331 ఎగ్జిక్యూటివ్‌, 566 నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ పోస్టులు ఉన్నాయి. డిసెంబర్ 21 నుంచి జనవరి 30 వరకు అప్లికేషన్ గడువు ఉండగా.. అభ్యర్థుల ఇబ్బందులను దృష్యా అప్లికేషన్ గడువును పెంచింది.




Tags:    

Similar News