Group-1 results: గ్రూప్-1 ఫలితాలు విడుదల.. చెక్ చేసుకోండిలా
గ్రూప్-1 ఫలితాలు విడుదలయ్యాయి. ఏపీపీఎస్సీ ఛైర్మన్ గౌతమ్ సవాంగ్ విజయవాడలో ఫలితాలు ప్రకటించారు. మొత్తం 111 పోస్ట్ లకు సంబంధించిన తుది ఫలితాలు విడుదలయ్యాయి. గతేడాది సెప్టెంబర్ 30న 110 పోస్టులకు గ్రూప్1 నోటిఫికేషన్ విడుదల చేయగా.. జనవరి 8న ఏపీపీఎస్సీ ప్రిలిమ్స్ పరీక్షను నిర్వహించారు. కేవలం 19 రోజుల్లోనే ప్రిలిమ్స్ ఫలితాలు విడుదల చేశారు. గ్రూప్ 1 ప్రిలిమ్స్ కు 86 వేల మంది హాజరు కాగా.. అందులో 6,455 మంది మెయిన్స్ కు అర్హత సాధించారు. జూన్ 3 నుంచి 10 వరకు మెయిన్స్ జరిగాయి. ప్రిలిమ్స్ ద్వారా 111 పోస్టులకు 259 మంది అర్హత సాధించగా.. అందులో 39 మందిని స్పోర్ట్స్ కోటాలో ఎంపిక చేశారు. ఆగస్టు 2 నుంచి 11 వరకు వాళ్లకు ఇంటర్వ్యూలు జరిగాయి. ఆ తుది ఫలితాలను గురువారం (ఆగస్ట్ 17)న ఏపీపీఎస్సీ విడుదల చేసింది. అభ్యర్థులు psc.ap.gov.in వెబ్ సైట్ ద్వారా తమ ఫలితాలు చెక్ చేసుకోవచ్చు.