Mega DSC Notification : డీఎస్సీకి సర్కార్ కసరత్తు.. మరిన్ని పోస్టులు యాడ్!

Byline :  Bharath
Update: 2024-01-06 02:08 GMT

రాష్ట్ర ప్రభుత్వం డీఎస్సీ నిర్వహణకు కసరత్తు మొదటుపెట్టింది. ఖాళీగా ఉన్న మొత్తం పోస్టుల వివరాలను సేకరిస్తుంది. ఈ డేటానంతా స్కూల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్లు సేకరిస్తున్నారు. జిల్లాల వారీగా ఏఏ పోస్టులు ఖాళీగా ఉన్నాయో డేటా ఇవ్వాలని డీఈఓలకు ఆదేశాలు జారీ చేశారు. వీటితో పాటు మరికొన్ని పోస్టులను ఈ లిస్ట్ లో యాడ్ చేసినట్లు తెలుస్తుంది. ఈ క్రమంలో ఓ గ్రామంలోని స్కూళ్లో ఎంతమంది పిల్లలు ఉన్నా.. స్కూల్ ను నడపాలని విద్యాశాఖ ఆదేశాలిచ్చింది. అందుకోసం అవసరమైన మేగా డీఎస్సీని నిర్వహించాలని నిర్ణయించారు. గతేడాది సెప్టెంబర్ 6న 5089 టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయగా.. దీనికి 1.77 లక్షల మంది అప్లై చేశారు. అయితే నవంబర్ లో జరగాల్సిన పరీక్షలను అసెంబ్లీ ఎన్నికల వల్ల వాయిదా వేశారు.

కొత్తగా ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం నోటిఫికేషన్ లో మరిన్ని పోస్టులు యాడ్ చేసి, సప్లిమెంటరీ నోటిఫికేషన్ ఇవ్వాలని భావిస్తుంది. రాష్ట్రంలో 1.22 లక్షల టీచర్ పోస్టులకు గాను.. 1.03 లక్షల మంది మాత్రమే పనిచేస్తున్నారు. మిగిలిన పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అందుకే మెగా డీఎస్సీని విడుదల చేసి 11 వేల పోస్టుల భర్తీకి ప్రభుత్వం ప్రణాళిక రూపొందిచినట్లు తెలుస్తుంది. మొత్తం 9,370 పోస్టులు ఖాళీ ఉండగా.. గత ప్రభుత్వం 5,089 పోస్టులకే నోటిఫికేషన్ ఇచ్చింది. వీటితో పాటు మరొకొన్ని పోస్టులను భర్తీ చేసే ఆలోచనలో ప్రస్తుత ప్రభుత్వం ఉంది. 




Tags:    

Similar News