TS CPGET 2023 Results: సీపీగెట్2023 ఫలితాలు విడుదల.. రిజల్ట్స్ కోసం క్లిక్ చేయండి
తెలంగాణ విశ్వవిద్యాలయాలతో పాటు జేఎన్టీయూహెచ్ లోని పీజీ సీట్ల భర్తీకి నిర్వహించిన కామన్ ప్రవేశ పరీక్ష సీపీగెట్2023 (CPGET2023) ఫలితాలు విడుదలయ్యాయి. రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ఆచార్య లింబాద్రి, ఓసీ వీసీ రవీందర్ ఈ ఫలితాలను విడుదల చేశారు. జూన్ 30 నుంచి జులై 10 వరకు నిర్వహించిన ఉమ్మడి ప్రవేశ పరీక్షలకు 60,443 మంది విద్యార్థులు హజరయ్యారు. అందులో 93.42% ఉత్తీర్ణత నమోదైందిని లింబాద్రి తెలిపారు. ఈ పరీక్షల్లో విద్యర్థులు సాధించిన మార్కులు, రిజర్వేషన్ల ఆధారంగా సీట్లు కేటాయించనున్నారు. రాష్ట్రంలోని ఉస్మానియా, కాకతీయ, తెలంగాణ, పాలమూరు, మహాత్మాగాంధీ, శాతవాహన, తెలంగాణ మహిళా యూనివర్సిటీలతో పాటు జేఎన్టీయూ హైదరాబాద్ పీజీ, ఇంటిగ్రేటెడ్, పీజీ డిప్లమా కోర్సుల్లో ప్రవేశాలు కల్పింస్తారు. కాగా విద్యార్థులు తమ ర్యాంక్ కార్డులను పొందడం కోసం ఇక్కడ క్లిక్ చేయండి..https://cpget.tsche.ac.in/CPGET/CPGET_GetRankCard.aspx