DSC Notification 2023 : డీఎస్సీ పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. ఖాళీలు ఎన్నంటే?
By : Mic Tv Desk
Update: 2023-08-25 10:59 GMT
డీఎస్సీ అభ్యర్థులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. తెలంగాలో డీఎస్సీ ద్వారా పోస్టుల భర్తీ చేయనున్న ప్రభుత్వం ప్రకటించింది. డీఎస్సీ పోస్టుల భర్తీకి అనుమతినిస్తూ ఆర్తిక మంత్రిత్వ శాఖ అనుమతించింది. ఈ మేరకు రాష్ట్రంలోని 5,089 టీచర్ పోస్టులు భర్తీ కానున్నాయి. ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. రాష్ట్రంలో కొన్ని టీచర్ పోస్టులనైనా భర్తీ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. కాగా, త్వరలో దీనికి సంబంధించిన నోటిఫికేషన్తో పూర్తి వివరాలు వెల్లడిస్తామని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు.
భర్తీ కానున్న పోస్టులు:
2,575- ఎస్జీటీ పోస్టులు
1739- స్కూల్ అసిస్టెంట్ పోస్టులు
611 భాషా పండిట్ పోస్టులు
164- పీఈటీ పోస్టులు