Group-1:త్వరలోనే గ్రూప్-1, 2 కొత్త నోటిఫికేషన్లు

Update: 2023-08-17 17:19 GMT

గ్రూప్-1 ఫలితాలు తాజాగా విడుదల చేసిన విషయం తెలిసిందే. ఏపీపీఎస్సీ ఛైర్మన్ గౌతమ్ సవాంగ్ విజయవాడలో ఈ ఫలితాలు ప్రకటించారు. మొత్తం 111 పోస్ట్ లకు సంబంధించిన తుది ఫలితాలు విడుదలయ్యాయి. ఈ క్రమంలో సవాంగ్ మరో శుభవార్త చెప్పారు. సెప్టెంబర్ నెల ముగిసేలోపు మరో గ్రూప్-1 నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు తెలిపారు. గ్రూప్ 1 దరఖాస్తు ప్రక్రియ పూర్తైన వెంటనే గ్రూప్-2 నోటిఫికేషన్ కూడా విడుదల చేస్తామని అన్నారు. అయితే ఈసారి నిర్వహించే గ్రూప్-2 సిలబస్ లో భారీ మార్పులు చేపట్టనున్నారు. అంతేకాకుండా 17 ఏళ్ల తర్వాత అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు భర్తీ చేయబోతున్నట్లు తెలిపారు.



AP news,APPSC,APPSC Group 1, APPSC Group 1 Final Results, APPSC Group 1 Final Results 2023,APPSC chairman Gautam Sawang,education news,ap news,APPSC new notification, new group1,group2 notification

Tags:    

Similar News