Teachers Transfers : టీచర్ల బదిలీకి హైకోర్ట్ గ్రీన్ సిగ్నల్
టీచర్ల బదిలీకి తెలంగాణ హైకోర్ట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. యూనియన్ నేతలకు అదనపు పాయింట్లు ఇవ్వకుండానే..బదిలీలకు హై కోర్టు అనుమతి తెలిపింది. బదిలీలపై మధ్యంతర ఉత్తర్వులను సవరించిన హై కోర్టు తుది తీర్పుకు లోబడి బదిలీలు ఉండాలని స్పష్టం చేసింది.
ఉపాధ్యాయుల బదిలీలకు సంబంధించి తెలంగాణ హై కోర్టు తీపికబురు చెప్పింది. టీచర్ల బదిలీలకు హై కోర్టు అనుమతి తెలిపింది.ఈ అంశంలో వచ్చిన మధ్యంతర స్టే ఉత్తర్వులను సవరించిన హై కోర్టు తాజాగా తన ఆదేశాలను జారీ చేసింది. యూనియన్ నేతలకు 10 ఎక్స్‌స్ట్రా పాయింట్లు ఇవ్వడాన్ని తప్పుబట్టిన హైకోర్ట్.. తాజాగా నేతలకు అదనపు పాయింట్లు ఇవ్వకుండా ట్రాన్స్‌ఫర్స్‌కు పచ్చజెండా ఊపింది. ఉపాధ్యాయ దంపతులకు ఎక్స్‌స్ట్రా పాయింట్లు ఇచ్చేందుకు హైకోర్టు అనుమతి తెలిపింది. భార్యాభర్తలు కలిసి ఉండాలన్నది ఈ నిబంధన ఉద్దేశమని స్పష్టం చేసింది. బదిలీలపై మధ్యంతర ఉత్తర్వులను సవరించిన హై కోర్టు టీచర్ల బదిలీలు తుది తీర్పునకు లోబడి జరగాలని ఉత్తర్వుల్లో తెలిపింది.