4451 ఉద్యోగాలు.. ఈరోజే లాస్ట్ డేట్.. మీరు అప్లై చేశారా

Byline :  Veerendra Prasad
Update: 2023-08-28 06:22 GMT

దేశంలోని పలు బ్యాంకుల్లో ఉద్యోగాల భర్తీకి (IBPS Recruitment) IBPS దరఖాస్తుల గడువు నేటితో ముగియనుంది. మొత్తం 11 ప్రభుత్వరంగ బ్యాంకుల్లో 3049 ప్రొబేషనరీ ఆఫీసర్‌/మేనేజ్‌మెంట్‌ ట్రైనీ, వేర్వేరు విభాగాల్లోని 1402 స్పెషలిస్ట్‌ ఆఫీసర్‌ పోస్టులకు దరఖాస్తుల ప్రక్రియ ఆగస్టు 28తో ముగియనుంది. మొత్తం 4,451 పోస్టులకు తొలుత ఆగస్టు 1 నుంచి 21వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించగా.. ఇటీవల మరో వారం రోజుల పాటు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఆ గడువు సైతం సోమవారంతో ముగియనుంది. ఆసక్తి కలిగిన అర్హులైన వారు వెంటనే దరఖాస్తు చేసుకోండి.

ప్రొబేషనరీ ఆఫీసర్ (PO)/ మేనేజ్‌మెంట్ ట్రైనీ(MT) పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోవాలంటే ఏదైనా స్ట్రీమ్‌లో బ్యాచిలర్ డిగ్రీ తప్పనిసరి. స్పెషలిస్ట్ ఆఫీసర్ (SO) కేటగిరీ ఉద్యోగాల కోసం సంబంధిత ఫీల్డ్‌లో గ్రాడ్యుయేషన్, డిప్లొమా, పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వారు అప్లై చేసుకోవచ్చు

దరఖాస్తు చేసే విధానం

ముందు ఐబీపీఎస్ అధికారిక పోర్టల్ ibps.in ఓపెన్ చేయాలి. హోమ్ పేజీలోకి వెళ్లి వేర్వేరుగా అందుబాటులో ఉన్న ఐబీపీఎస్ పీవో/ఎంటీ రిక్రూట్‌మెంట్, ఐబీపీఎస్ ఎస్‌వో రిక్రూట్‌మెంట్ లింక్‌లపై క్లిక్ చేయాలి.

అర్హత ఉన్న పోస్ట్‌కు అభ్యర్థులు తమ వ్యక్తిగత వివరాలను ఎంటర్ చేసి రిజిస్టర్ అవ్వాలి. ఆ తరువాత రిజిస్టర్ ఐడీ, పాస్‌వర్డ్ సాయంతో లాగిన్ అయి అప్లికేషన్ ఫారమ్ ఓపెన్ చేయాలి. అప్లికేషన్ ఫీజు చెల్లించి.. కీలకమైన డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేయాలి. చివరగా అప్లికేషన్‌ను సబ్‌మిట్ చేయాలి.

జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ అభ్యర్థులు అప్లికేషన్ ఫీజుగా రూ.850 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులు రూ.175 పేమెంట్ చేయాలి.

ఐబీపీఎస్ పీవో/ఎంటీ, ఎస్‌ఓ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ మూడు దశలో ఉంటుంది. మొదట ప్రిలిమ్స్ ఎగ్జామ్, ఆ తరువాత మెయిన్స్, చివరగా ఇంటర్వ్యూ ఉంటుంది. పీవో/ఎంటీ ప్రిలిమ్స్ ఎగ్జామ్ సెప్టెంబర్ 23, 30, అక్టోబర్ 1న జరగనుంది. ఈ పరీక్షల కోసం అడ్మిట్‌కార్డ్స్ సెప్టెంబర్‌లో జారీ చేస్తారు. మెయిన్స్ ఎగ్జామ్ నవంబర్ 5న జరగనుంది. ఆ తరువాత ఇంటర్వ్యూ షెడ్యూల్ ప్రకటిస్తారు.

ఐబీపీఎస్ ఎస్‌వో ప్రిలిమ్స్ ఎగ్జామ్ డిసెంబర్ 30, 31 తేదీల్లో నిర్వహిస్తారు. అడ్మిట్‌కార్డ్‌లు అక్టోబర్ 23 నుంచి అందుబాటులోకి రానున్నాయి. మెయిన్స్ ఎగ్జామ్ జనవరి 28న ఉంటుంది. ఆ తరువాత ఇంటర్వ్యూ షెడ్యూల్ వెలువడనుంది. ఐబీపీఎస్ రిక్రూట్‌మెంట్ ద్వారా పీవో/ఎంటీ, ఎస్‌వో పోస్ట్‌లకు ఎంపికయ్యే అభ్యర్థులకు జీతం నెలకు రూ.36,400 నుంచి రూ.64,600 మధ్య లభిస్తుంది.

పోస్టులు భర్తీ చేసే బ్యాంకులివే.. బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, కెనరా బ్యాంక్‌, ఇండియన్‌ ఓవర్సీస్‌ బ్యాంక్‌, యూకో బ్యాంక్‌, బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌, యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్ర, ఇండియన్‌ బ్యాంక్‌, పంజాబ్‌ అండ్‌ సింధ్‌ బ్యాంక్‌

Tags:    

Similar News