దేశంలోని పలు బ్యాంకుల్లో ఉద్యోగాల భర్తీకి ఐబీపీఎస్ నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. మొత్తం 11 ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో 3049 ప్రొబేషనరీ ఆఫీసర్, మేనేజ్మెంట్ ట్రైనీ సహా వేరు వేరు విభాగాల్లో 1402 స్పెషలిస్ట్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైంది. కాగా, ఈ పోస్ట్ లకు దరఖాస్తు ప్రక్రియ ఆగస్ట్ 28తో ముగియనుంది. మొత్తం 4451 పోస్ట్ లకు మొదట ఆగస్ట్ 1 నుంచి 21 వ తేదీ వరకు ఆన్ లైన్ అప్లికేషన్లు స్వీకరించగా.. ఇటీవలే చివరి తేదీని మరో వారం రోజుల పాటు పెంచారు. ఆ గడువు కూడా సోమవారం (ఆగస్ట్ 28) తో ముగియనుంది. ఆసక్తి గల అర్హులైన అభ్యర్థులు వెంటనే అప్లై చేసుకోండి.
ఉద్యోగాలు ఖాళీ ఉన్న బ్యాంకులివే:
ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, యూకో బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ బ్యాంక్, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, కెనరా బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర