రైల్వే కోచ్ ఫ్యాక్టరీలో ఉద్యోగాలకు నోటిఫికేషన్..

Update: 2023-06-28 07:55 GMT

చెన్నై ఇంటిగ్రల్ కోచ్​ ఫ్యాక్టరీ (ఐసీఎఫ్​) అప్రెంటీస్​ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ రిక్రూట్​మెంట్​ ద్వారా మొత్తం 782 ఖాళీలన భర్తీ చేయనున్నారు. 252 ఫ్రెషర్స్​, 530 ఎక్స్​-ఐటీఐ అప్రెంటీస్​ పోస్టులను ఈ నోటిఫికేషన్​ ద్వారా భర్తీ చేయనున్నారు.అర్హులైన అభ్యర్థులు ఆన్​లైన్​లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఫ్రెషర్స్కు 6వేలు, ఐటీఐ అభ్యర్థులకు 7వేల స్టైఫండ్ ఇస్తారు.

ఆసక్తి గల అభ్యర్థులు ఇంటిగ్రల్​ కోట్​ ఫ్యాక్టరీ చెన్నైకు సంబంధించిన అధికారిక వెబ్​సైట్​ను సందర్శించాలి. మే 31 ప్రారంభమైన అప్లికేషన్ ప్రక్రియ జూన్ 30తో ముగఆన్​లైన్​ దరఖాస్తుకు చివరి తేదీ : 2023 జూన్​ 30

అర్హతలు : అభ్యర్థులు గుర్తింపు పొందిన బోర్డుల​ నుంచి 10వ తరగతి, 10+2 ఉత్తీర్ణత సాధించడం సహా సంబంధిత ఐటీఐ క్వాలిఫికేషన్ కూడా పొంది ఉండాలి.

వయోపరిమితి : అభ్యర్థుల వయస్సు 2023 జూన్​ 30నాటికి 15 నుంచి 24 ఏళ్ల మధ్య ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఆయా కేటగిరీల వారికి వయోపరిమితి సడలింపులు వర్తిస్తాయి.

Tags:    

Similar News