IDBI Recruitment 2023 : ఐడీబీఐ అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాలు.. ఇలా అప్లై చేయండి
బ్యాంక్ ఉద్యోగాల (Bank Jobs)కు ప్రిపేర్ అవుతున్న వారికి గుడ్ న్యూస్. ప్రైవేటు రంగ IDBI బ్యాంక్ జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాలకు ఆన్‌లైన్ రిక్రూట్‌మెంట్ ప్రాసెస్ ప్రారంభించింది. మొత్తం 600 పోస్టులకు రిజిస్ట్రేషన్స్ ప్రారంభమయ్యాయి. అర్హత ఉన్నవారు సెప్టెంబర్ 30 వరకు idbibank.in అధికారిక వెబ్‌సైట్‌లో అప్లై చేసుకోవచ్చు.
అర్హతలు
ఈ ఉద్యోగాలకు అప్లై చేసే అభ్యర్థుల వయసు 20 నుంచి గరిష్టంగా 25 ఏళ్ల మధ్య ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయో పరిమితి సడలింపు నిబంధనలు వర్తిస్తాయి. గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ చదివిన వారు లేదా దానికి సమానమైన అర్హత ఉన్నవారు అప్లై చేసుకోవచ్చు.
ఎంపిక ప్రక్రియ
ఎంపిక ప్రక్రియలో ముందు ఆన్‌లైన్ టెస్ట్ ఉంటుంది. ఇందులో క్వాలిఫై అయిన వారికి పర్సనల్ ఇంటర్వ్యూ నిర్వహించి సెలక్ట్ చేస్తారు. మొత్తం 600 పోస్టుల్లో 243 జనరల్ కేటగిరీకి కేటాయించారు. మిగిలిన 162 ఓబీసీ, 90 ఎస్సీ, 45 ఎస్టీ, 60 ఈడబ్ల్యూఎస్ విభాగాలకు కేటాయించారు.
జీతం
మొదటి ఆరు నెలల ట్రైనింగ్ పీరియడ్‌లో నెలకు రూ.5,000 చొప్పున స్టైఫండ్ ఇస్తారు. తర్వాతి రెండు నెలల ఇంటర్న్‌షిప్ సమయంలో అభ్యర్థులు నెలకు రూ.15,000 అందుకుంటారు. PGDBF కోర్సును పూర్తి చేసిన తర్వాత జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ -JAM (గ్రేడ్ 'O')గా బ్యాంకులో జాయిన్ అవుతారు. అప్పుడు సీటీసీ (క్లాస్ A సిటీ) ఏడాదికి రూ.6.14 లక్షల నుంచి రూ.6.50 లక్షల మధ్య ఉంటుంది.
ఎలా అప్లై చేసుకోవాలంటే?
ముందుగా అధికారిక వెబ్‌సైట్ idbibank.in ఓపెన్ చేసి.. హోమ్‌పేజీలో ‘కెరీర్’ ట్యాబ్ క్లిక్ చేయాలి.
ఇప్పుడు కొత్త పేజీలో కనిపించే ‘రిక్రూట్‌మెంట్ ఆఫ్ జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ త్రూ అడ్మిషన్ టు IDBI Bank PGDBF – 2023-24.’ లింక్ ఓపెన్ చేయాలి.
తర్వాత అభ్యర్థులు రిజిస్టర్ చేసుకొని, అప్లికేషన్ ఫారమ్ యాక్సెస్ చేయాలి.
ఫారమ్‌లో అడిగిన అన్ని వివరాలు నింపాలి. అప్లికేషన్ ఫీజు చెల్లించి, ఫారమ్‌ను సబ్‌మిట్ చేయండి.
జనరల్ కేటగిరీ అభ్యర్థులు రూ.1,000 అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. SC/ST/PWD అభ్యర్థులు రూ. 200 చెల్లించాలి… అప్లై చేసిన తర్వాత అప్లికేషన్ ను డౌన్లోడ్ చేసుకోవాలి.