ఇంటెలిజెన్స్‌ బ్యూరోలో ఉద్యోగాలు.. జీతం ఎంతంటే?

Update: 2023-06-01 14:39 GMT

మీరు ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నారా.. అది కూడా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగమే మీ లక్ష్యమా.. అయితే మీకో గుడ్ న్యూస్. కేంద్రం ఇంటెలిజెన్స్ బ్యూరోలో 797 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఐబీలో 797 జూనియర్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ల నియామకానికి దరఖాస్తులకు ఆహ్వానం పలుకుతోంది. డిప్లొమా/డిగ్రీ పూర్తిచేసిన వారు వీటికి అర్హులు. అర్హులైన అభ్యర్థులు జూన్‌ 3 నుంచి 23వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవచ్చు.

అప్లికేషన్స్ : జూన్‌ 3నుంచి 23 వరకు

అప్లికేషన్ ఫీ : జనరల్‌/ ఓబీసీ అభ్యర్థులు రూ.450లు, ఎస్సీ, ఎస్టీ, ఎక్స్‌ సర్వీస్‌మెన్‌లకు ఫీజు నుంచి మినహాయింపు

ఏజ్ లిమిట్ : 18 నుంచి 27 ఏళ్లు లోపు ఉండాలి. ఎస్సీ/ఎస్టీలకు ఐదేళ్లు/ఓబీసీలకు మూడేళ్లు చొప్పున వయో సడలింపు

విద్యార్హతలు: డిప్లొమా ఇన్‌ ఇంజినీరింగ్‌ లేదా బ్యాచిలర్‌ డిగ్రీ (ఎలక్ట్రానిక్స్‌/కంప్యూటర్‌ సైన్స్‌/ఫిజిక్స్‌/మేథమెటిక్స్‌ సబ్జెక్టులుగా ఉండాలి). లేదా బీసీఏ పాసైన వారు అర్హులు.

జీతం : రూ.25,500 - 81,100 (ఇతర అలవెన్సులు అదనం)

Tags:    

Similar News