మరో 10 రోజుల్లో తెలంగాణ ఇంటర్ ఎగ్జామ్స్ ప్రారంభం కానున్నాయి. ఈ నెల 28 నుంచి మార్చి 19వరకు ఎగ్జామ్స్ జరగనున్నాయి. ఈ క్రమంలో ఇవాళ ఇంటర్ బోర్డు హాల్ టికెట్లు విడుదల చేయనుంది. ఇంటర్ బోర్డు అధికారిక వెబ్ సైట్ నుంచి విద్యార్థులు హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకోవచ్చు. tsbie.cgg.gov.in వెబ్ సైట్లో డేట్ ఆఫ్ బర్త్ లేదా గత ఏడాది హాల్ టికెట్ నంబర్ ఎంటర్ చేసి హాల్ టికెట్ డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ఈ ఏడాది 9.8లక్షల మంది విద్యార్థులు ఇంటర్ ఎగ్జామ్స్ రాయనున్నారు. ప్రతి రోజు 9 నుంచి 12 గంటల మధ్య ఎగ్జామ్స్ జరగనున్నాయి. ఎగ్జామ్స్ కు సంబంధించి అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నారు. విద్యార్థులకు ఎటువంటి అసౌకర్యాలు జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మే 9 నుంచి 12 వరకు ఎంసెట్ పరీక్షలు జరగనున్నాయి. అదేవిధంగా ఏప్రిల్ 1 -15 మధ్య జేఈఈ మెయిన్స్ చివర విడత ఎగ్జామ్స్ ఉన్నాయి.