Navodaya Exam Date 2024 : రేపే నవోదయ పరీక్ష .. సీటు సాధిస్తే ఏడేళ్లపాటు అంతా ఉచితం
విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తున్న జవహర్ నవోదయ విద్యాలయం(2024-25)లో ప్రవేశాలకు ఈ నెల 20వ తేదీన అర్హత పరీక్ష నిర్వహించనున్నారు. ఆరో తరగతిలో ప్రవేశానికి నిర్వహించబోయే ఈ పరీక్షకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. తెలుగు రాష్ట్రాల్లో రేపు ఉదయం 11.30 నిమిషాల నుంచి మధ్యాహ్నం 1.30 వరకు పరీక్ష జరుగనుంది. ఒక్క నిమిషం ఆలస్యమైనా విద్యార్థులను పరీక్షా కేంద్రంలోకి అనుమతించరు. ఏపీలో 91,041 మంది, తెలంగాణ నుంచి 50,332 మంది పరీక్ష రాయనుండగా ... ఏపీలో 416, తెలంగాణలో 244 సెంటర్లు ఏర్పాటు చేశారు. హల్ టికెట్స్ కోసం ఈ లింక్ https://cbseitms.rcil.gov.in/nvs/AdminCard/AdminCard?AspxAutoDetectCookieSupport=1 క్లిక్ చేయండి
నవోదయ పరీక్ష 100 మార్కులకు 80 శాతం ప్రశ్నలు ఉంటాయి. సమయం రెండు గంటలు. దివ్యాంగులకు అదనంగా 40 నిమిషాలు సమయం ఇస్తారు. మేధాశక్తిని పరీక్షించేందుకు 50 మార్కులకు 40 ప్రశ్నలు, గణితంలో ప్రతిభను తెలుసుకునేందుకు 25 మార్కులకు 20 ప్రశ్నలు, భాషా పరిజ్ఞానాన్ని పరీక్షించేందుకు 25 మార్కులకు 20 ప్రశ్నలు ఇస్తారు.
నవోదయ విద్యాలయంలో ఆరో తరగతిలో సీటు సాధిస్తే ఏడు సంవత్సరాల పాటు ఉచిత విద్య అందుతుంది. బనవాసి జవహర్ నవోదయ విద్యాల యంలో 80 సీట్లు అందుబాటులో ఉన్నాయి. బాలికలకు 30 శాతం, ఎస్సీలకు 15 శాతం, ఎస్టీలకు 7.5 శాతం, దివ్యాంగులకు 3 శాతం సీట్లు కేటాయిస్తున్నారు. మొత్తం 80 సీట్లలో 75 శాతం అంటే 60 సీట్లను గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు, 20 సీట్లు పట్టణ ప్రాంతాల విద్యార్థులకు కేటాయిస్తారు.