విద్యార్థులకు గుడ్‌న్యూస్.. 'నవోదయ'కు గడువు పెంపు

Update: 2023-08-27 03:15 GMT

దేశవ్యాప్తంగా 649 జవహర్‌ నవోదయ విద్యాలయ(JNV)లో ఆరో తరగతిలో ప్రవేశాలకు సంబంధించి ఆన్‌లైన్‌ దరఖాస్తు గడువును ఆగస్టు 31 వరకు పొడిగించినట్లు నవోదయ విద్యాలయ సమితి ఓ ప్రకటనలో వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్‌లో 15, తెలంగాణలో 9 జేఎన్‌వీలు ఉన్నాయి. ప్రభుత్వ, ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో ఐదో తరగతి చదువుతున్న విద్యార్థులు అర్హులు. గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు 75 శాతం సీట్లు కేటాయించారు. మిగిలిన 25శాతం సీట్లు పట్టణ ప్రాంత విద్యార్థులకు కేటాయించారు. ఏటా నిర్వహించే ప్రవేశ పరీక్ష ద్వారా విద్యార్థులను ఎంపిక చేస్తారు. ప్రవేశ పరీక్ష ద్వారా ఎంపికైన విద్యార్థులకు 6వ తరగతి నుంచి 12వ తరగతి వరకు ఉచిత విద్య అందిస్తారు. బాలబాలికలకు వేర్వేరు ఆవాస, వసతి సౌకర్యాలు కల్పించారు. ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో ఐదో తరగతి చదువుతున్న విద్యార్థులు దరఖాస్తులకు అర్హులు. ఆసక్తి గల విద్యార్థులు https://navodaya.gov.in/ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

జవహర్‌ నవోదయ ప్రవేశానికి నిర్వహించే రాత పరీక్షలో వచ్చే మార్కులు ఆధారంగా విద్యార్థులను ఎంపిక చేస్తారు. ప్రవేశ పరీక్ష ప్రశ్నపత్రంలో మూడు విభాగాలు (మెంటల్‌ ఎబిలిటీ, అరిథ్‌మెటిక్‌, లాంగ్వేజ్‌) ఉంటాయి. మొత్తం 80 ప్రశ్నలు 100 మార్కులకు 2 గంటల సమయంలో ప్రవేశ పరీక్ష ఉంటుంది.

ప్రవేశ పరీక్ష ఆధారంగా సీటు కేటాయిస్తారు. రెండు విడతల్లో నిర్వహించే ఈ పరీక్ష ఫలితాలను వచ్చే ఏడాది మార్చి/ ఏప్రిల్‌లో విడుదల చేసే అవకాశం ఉంది.

నిర్ణీత తేదీల్లో ఉదయం 11.30 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు రెండు గంటల పాటు జరిగే ఈ పరీక్ష 100 మార్కులకు ఉంటుంది. మొత్తం 80 ప్రశ్నలు ఇస్తారు. దీంట్లో మెంటల్‌ ఎబిలిటీ నుంచి 40 ప్రశ్నలకు 50 మార్కులు ఉంటాయి. దాంతో పాటు అర్థమెటిక్‌ నుంచి 20 ప్రశ్నలకు 25 మార్కులు; లాంగ్వేజ్‌ టెస్ట్‌ 20 ప్రశ్నలకు 25 మార్కుల చొప్పున ఇస్తారు. మెంటల్‌ ఎబిలిటీకి గంట సమయం ఉండగా.. మిగతా రెండింటికీ ఒక్కోదానికి అరగంట పాటు సమయం ఇస్తారు.

Tags:    

Similar News