NTA JEE Main Application : జేఈఈ మెయిన్ దరఖాస్తు ప్రారంభం.. ఎగ్జామ్ డేట్ ఎప్పుడంటే.?

Byline :  Bharath
Update: 2023-11-02 06:53 GMT

కేంద్ర ప్రభుత్వ నిధులతో నడిచే ఐఐటీ, ఎన్ఐటీ, ట్రిపుల్ ఐటీ ఇంజినీరింగ్ సంస్థల్లో ప్రవేశాలకోసం నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్ష జేఈఈ మెయిన్స్ ఉమ్మడి ప్రవేశ పరీక్షకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం అయింది. బుధవారం (నవంబర్ 1) ప్రారంభం అయిన అప్లికేషన్ ప్రక్రియ.. నవంబర్ 31 రాత్రి 9 గంటలకు ముగుస్తుంది. ఈ ఎగ్జామ్ ను రెండు విడతల్లో నిర్వహిస్తుండగా.. వచ్చే ఏడాది జనవరిలో మొదటి సెషన్, ఏప్రిల్ లో రెండో సెషన్ నిర్వహించనున్నారు.

కంప్యూటర్ బేస్డ్, ఆన్ లైన్ విధానంలో ఎగ్జామ్ ఉంటుంది. ఈ మేరకు జనవరి సెషన్ కు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల అయింది. తెలుగు, హిందీ, ఇంగ్లీష్ తో పాటు మొత్తం 13 భాషల్లో ఎగ్జామ్ నిర్వహిస్తారు. జేఈఈ మెయిన్‌లో రెండు పేపర్లు ఉంటాయి. బీఈ, బీటెక్‌ కోర్సుల కోసం పేపర్‌-1, బీఆర్క్‌, బీప్లానింగ్‌ కోర్సుల కోసం పేపర్‌-2 నిర్వహిస్తారు. అడ్మిట్ కార్డులు పరీక్ష తేదీకి 3 రోజుల ముందు విడుదల చేస్తారు. పూర్తి వివరాలు www.nta.ac.in, https://jeemain.nta.ac.in/ వెబ్ సైట్ లో తెలుసుకోవచ్చు.




Tags:    

Similar News