Job Notification : బీటెక్ అర్హత, భారీ జీతంతో.. PNBలో ఉద్యోగాలు
నిరుద్యోగులకు గుడ్ న్యూస్. బ్యాంకులో ఉద్యోగం చేయాలనుకునే వారికి పంజాబ్ నేషనల్ బ్యాంకు శుభవార్త చెప్పింది. తమ సంస్థలో భారీగా ఉద్యోగాలను భర్తీ చేస్తూ.. నోటీఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ నోటిఫికేషన్ ప్రకారం మొత్తం 1,025 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇందులో పోస్ట్‌లను అనుసరించి.. బీఈ, బీటెక్, ఎంఈ, ఎంటెక్, ఎంబీఏ, ఎంసీఏ, సీఏ, సీఎంఏ, సీఎఫ్‌ఏ ఉత్తీర్ణులై ఉండాలి. ఇతర సందేహాల కోసం PNB అఫీషియల్ వెబ్ సైట్.. https://www.pnbindia.in/Recruitments.aspx లో చెక్ చేసుకోవచ్చు.
మొత్తం 1,025 ఖాళీలు:
నాలుగు విభాగాల్లో మొత్తం 1,025 పోస్ట్‌లను భర్తీ చేయనున్నారు. ఇందులో క్రెడిట్ ఆఫీసర్ పోస్ట్‌లు1000, ఫారెక్స్ మేనేజర్ పోస్ట్‌లు 15, సైబర్ సెక్యూరిటీ మేనేజర్ పోస్ట్‌లు 5, సీనియర్ సైబర్ సెక్యూరిటీ మేనేజర్ పోస్ట్‌లు 5 ఉన్నాయి.
ఏజ్ లిమిట్ :
క్రెడిట్ ఆఫీసర్‌కు పోస్టులకు 21-28 ఏళ్లు వయసు కలిగి ఉండాలి. ఫారెక్స్ మేనేజర్, సైబర్ సెక్యూరిటీ మేనేజర్‌కు పోస్టులకు 25-35 ఏళ్లు, సీనియర్ మేనేజర్ సైబర్ సెక్యూరిటీ పోస్ట్‌కు 27-38 ఏళ్లు వయసు కలిగి ఉండాలి. PNB నిబంధనలను అనుసరించి రిజర్వ్డ్ కేటగిరీ వారికి వయో పరిమితిలో సడలింపు ఉంటుంది.
ఎంపిక ప్రక్రియ:
స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్ట్‌ల భర్తీకి రెండు ఎంపిక విధానాలు ఉంటాయి. తొలుత రాత పరీక్ష ఉంటుంది. అందులో ప్రతిభ కనబరిచినవారిని.. పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా సెలెక్ట్ చేస్తారు.
వేతనం:
జేఎంజీఎస్-1కు రూ.36,000 నుంచి రూ.63,840 వరకు జీతం ప్రారంభమవుతుంది.
ఎంఎంజీఎస్-2కు రూ.48,170 నుంచి రూ.69,810 వరకు జీతం ప్రారంభమవుతుంది.
ఎంఎంజీఎస్-3కు రూ.63,840 నుంచి రూ.78,230 వరకు జీతం ప్రారంభమవుతుంది.
షెడ్యూల్ వివరాలు:
ఆన్‌లైన్ అప్లికేషన్ చివరి తేదీ: ఫిబ్రవరి 25, 2024.
ఆన్‌లైన్ టెస్ట్ తేదీ: మార్చి లేదా ఏప్రిల్‌లో నిర్వహించే అవకాశం ఉంది.
తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్.