RBI Assistant Posts నిరుద్యోగులకు శుభవార్త.. డిగ్రీ ఉంటే చాలు..
భారతీయ కేంద్రబ్యాంక్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.. అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 450 అసిస్టెంట్ కొలువులు ఖాళీగా ఉన్నాయి. ఈ రోజు 13 నుంచి అక్టోబర్ 4వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆర్బీఐ రిక్రూట్‌మెంట్ అధికారిక వెబ్‌సైట్ opportunities.rbi.org.inలో అప్లై చేసుకోవాలి.
అర్హతలు
అభ్యర్థుల వయసు 20 నుంచి 28 ఏళ్లలోపు ఉండాలి. రిజర్వేషన్ల ప్రకారం వయోపరిమితిలో సడలింపు ఇస్తారు. ఏ డిగ్రీలోనైనా 50 శాం మార్కులతో పాసై, 2023 సెప్టెంబర్ 1 నాటికి పట్టా పొంది ఉండాలి. ఎస్టీ, ఎస్టీ, దివ్యాంగులకు మార్కుల విషయంలో మినహాయింపు ఉంటుంది. ఈ వర్గాల వారికి దరఖాస్తు ఫీజు రూ. 50, ఇతరులకు రూ. 450. దీనికి జీఎస్టీ అదనం.
పరీక్ష తేదీలు
ప్రిలిమినరీ పరీక్ష అక్టోబర్ 21, 23 తేదీల్లో ఆన్‌లైన్‌లో రాయాల్సి ఉంటుంది. డిసెంబర్ 2న మెయిన్ పరీక్ష ఉంటుంది. భాషా నైపుణ్యలా (లాంగ్వేజ్ ప్రొఫిషియెన్సీ టెస్ట్) కూడా పాస్ కావాలి.