అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ల పదవీ విరమణ వయసు 65 ఏళ్లకు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. అంతేకాకుండా ఉద్యోగ విరమణ చేసే అంగన్వాడీ టీచర్లకు రూ. లక్ష, మిని అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లకు రూ. 50వేలు ఆర్థిక సాయం చేయాలని నిర్ణయించుకుంది. దీనితో పాటు రాష్ట్రంలోని 3989 మినీ అంగన్ వాడీలను ప్రధాన అంగన్ వాడీ కేంద్రాలుగా స్థాయిని పెంచనున్నారు. అలాగే రిటైర్మెంట్ అయ్యాక ఆసరా పింఛన్ మంజూరు చేస్తామని ప్రకటించడంపై మంత్రి సత్యవతి రాథోడ్ హర్షం వ్యక్తం చేస్తూ సీఎం కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలిపారు.