RRB ALP Recruitment 2024 : అసిస్టెంట్ లోకో పైలెట్ నోటిఫికేషన్ రిలీజ్

Byline :  Kiran
Update: 2024-01-19 06:37 GMT

నిరుద్యోగులకు రైల్వే శాఖ గుడ్‌న్యూస్‌ చెప్పింది. ఖాళీగా ఉన్న అసిస్టెంట్ లోకోపైలెట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ ద్వారా భారతీయ రైల్వేలో 5696 అసిస్టెంట్ లోకో పైలట్ (ALP) పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆసక్తిగల అభ్యర్థులు RRB ALP Notification 2024ను RRB ప్రాంతీయ వెబ్‌సైట్లలో చెక్ చేసుకోవచ్చు.

నోటిఫికేషన్ - 18 జనవరి 2024

ఆన్ లైన్ అప్లికేషన్ల ప్రారంభ తేదీ - 20 జనవరి 2024

ఫీజు చెల్లించేందుకు చివరి తేదీ - 19 ఫిబ్రవరి 2024

అప్లికేషన్లకు చివరి తేదీ - 19 ఫిబ్రవరి 2024

విద్యార్హతలు

అసిస్టెంట్ లోకో పైలెట్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత విభాగంలో ఐటీఐ పూర్తి చేసి ఉండాలి. లేదా మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్ ఇంజనీరింగ్ లో మూడేళ్ల డిప్లొమా చేసి ఉంటాలి. ఏఐసీటీఈ గుర్తింపు పొందిన విద్యా సంస్థ నుంచి ఇంజినీరింగ్‌ పూర్తి చేసి ఉన్న వాళ్లు కూడా అప్లయ్‌ చేసుకోవచ్చు.

జీతం

ALP పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల జీతం రూ. 19,900 నుంచి ప్రారంభమవుతుంది.

వయసు

అభ్యర్థుల వయసు 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి.

కంప్యూటర్ బేస్డ్ ఆప్టిట్యూడ్ టెస్ట్

దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు కంప్యూటర్ బేస్డ్ ఆప్టిట్యూడ్ టెస్ట్ నిర్వహిస్తారు. అందులో జనరల్ అవేర్‌నెస్, జనరల్ అవేర్‌నెస్, మ్యాథమెటిక్స్, కరెంట్ అఫైర్స్, రీజనింగ్ తదితర అంశాలపై ప్రశ్నలు ఉంటాయి. జనరల్ నాలెడ్జ్, కరెంట్ అఫైర్స్ ప్రాక్టీస్ చేస్తే.. రాత పరీక్షను క్లియర్ చేయడం ఈజీ అవుతుంది. రిటెన్ టెస్ట్లో 120 ఆబ్జెక్టివ్ తరహా ప్రశ్నలు అడుగుతారు. పరీక్షలో నెగెటివ్ మార్కింగ్ ఉంది. ప్రతి రాంగ్ ఆన్సర్కు మూడో వంతు మార్కు కోత విధిస్తారు.

మెడికల్ టెస్ట్

కంప్యూటర్ బేస్ట్ ఆప్టిట్యూడ్ టెస్ట్లో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులకు వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. అందులో ఫిట్ అని తేలిన వారినే తుదుపరి దశకు పంపుతారు ఏ చిన్న లోపం ఉన్నా డిస్ క్వాలిఫై చేస్తారు. రాత పరీక్ష , మెడికల్ క్లియర్ అయిన తర్వాత.. డాక్యుమెంట్ వెరిఫికేషన్ జరుగుతుంది. అన్నీ పూర్తైన తర్వాత ట్రైనింగ్ ఉంటుంది. శిక్షణ పూర్తైన తర్వాత అసిస్టెంట్ లోకో పైలట్‌గా పోస్టింగ్ ఇస్తారు. మొదట గూడ్స్ రైలును నడిపే బాధ్యతను నిర్వహిస్తారు. ఆ తర్వాత ప్యాసింజర్ రైలును నడిపే అవకాశం లభిస్తుంది. 




 



Tags:    

Similar News